ఫైన‌ల్‌లో సింధు అప‌జ‌యం

PV Sindhu
P V SINDHU

బ్యాంకాక్: ఈ ఏడాది తొలి టైటిల్ గెలవాలన్న హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఆకాంక్ష నఎర‌వేర్చుకోలేక‌పోయారు. ఆదివారం జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్లో జపాన్‌కు చెందిన ఒకుహర చేతిలో 15-21, 18-21 తేడాతో సింధు ఓడిపోయింది. 50 నిమిషాల పాటు పోరాడినా.. ఒకుహర అటాకింగ్ ప్లే ముందు సింధు నిలవలేకపోయింది. తొలి గేమ్‌లో మొదటి నుంచీ వెనుకబడి పోయినా.. రెండో గేమ్‌లో పుంజుకున్న సింధు ఒక దశలో గేమ్‌ను ఈజీగా గెలిచేలా కనిపించింది. అయితే ఒకుహర మరోసారి అటాకింగ్‌కు దిగడంతో గేమ్ హోరాహోరీగా సాగింది. 18-18 దగ్గర స్కోరు సమమైన సమయంలో వరుసగా మూడు పాయింట్లు కొట్టిన ఒకుహర గేమ్‌తోపాటు మ్యాచ్ కూడా గెలిచింది.