ఫైనల్లో అడుగుపెట్టిన సింధు

pv sindhu
pv sindhu

సియోల్‌: తెలుగుతేజం, ఒలంపిక్‌ పతక విజేత పీవీ సింధు కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో
అడుగుపెట్టింది. హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో సింధు, చైనా క్రీడాకారిణి హి బింగ్‌జియావోను
21-10, 17-21, 21-16తో ఓడించింది. కాగా అదివారం జరిగే ఫైనల్లో పీవీ సింధు జపాన్‌ క్రీడాకారిణి,
ఎనిమిదో సీడు ఒకుహరాతో తలపడనుంది.