ఫేస్‌బుక్ నుంచి త‌ప్పుకుంటున్న టాప్ కంపెనీలు

facebook
facebook

న్యూయార్క్ః కోట్లాది మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమైందంటూ గత కొన్ని రోజులుగా ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో ఫేస్‌బుక్‌ చిక్కుల్లో పడింది. ఈ వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్న యూజర్లు ఫేస్‌‌బుక్‌ ఖాతాలను తొలగించాలని సోషల్‌మీడియాలో పిలుపునిస్తున్నారు. #deletefacebook హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం ప్రారంభించారు. తమవైపు నుంచి పొరబాటు జరిగిందని సంస్థ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ. ఈ ఉద్యమం ఆగట్లేదు. తాజాగా మొజిల్లా, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ లాంటి ప్రముఖ కంపెనీలు కూడా ఫేస్‌బుక్‌ను వీడుతున్నాయి.