ఫెస్‌బుక్‌ సీఈఓకు రాజీనామా ఒత్తిళ్లు ?

facebook ceo mark zuckerberg
facebook ceo mark zuckerberg

శాన్‌ఫ్రాన్సిస్‌కో: ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ఛైర్మన్‌, సిఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ను రాజీనామా చేయాలని పెట్టుబడిదారుల నుండి ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. ఫేస్‌బుక్ రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థ, పబ్లిక్‌ అఫైర్స్‌ సంస్థతో ఒప్పందం కుదర్చుకున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించిన కారణంగా జుకర్‌బర్గ్‌పై ఒత్తిడి పెరిగినట్లు గార్డియన్‌ అనే పత్రిక ఈరోజు తన కథనంలో పేర్కొంది. ఫేస్‌బుక్‌ పోటీదారులు, విమర్శకుల వ్యాఖ్యలు, ప్రకటనలకు ప్రాధాన్యం తగ్గించేలా పనిచేస్తాయని తెలిపింది. ఫేస్‌బుక్‌లో వాటా ఉన్న ట్రిల్లియం అసెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జొనాస్‌ క్రాన్‌ జుకర్‌బర్గ్‌ను బోర్డ్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం.