ఫెస్టివల్‌ సేల్‌ అఫర్లను ప్రకటించిన అమెజాన్‌!

Amazon
Amazon

ఢిల్లీ: దసరా పండగను పురస్కరించుకొని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ నాలుగురోజుల పాటు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌
అఫర్లను ప్రకటించింది. ఈ అఫర్‌ ఈ నెల 21 నుంచి 24 వరకు అందుబాటులో ఉండనుంది. దీనిలో భాగంగా దాదాపు 40వేలకు
పైగా అఫర్లు ఇస్తున్నట్లు ఈ సంస్థ తెలిపింది. అందులో ఎలక్ట్రానిక్స్‌పై 2500కు పైగా, స్మార్ట్‌ఫోన్లపై 500పైగా అఫర్లు ఉన్నాయని,
హోమ్‌ అప్లయన్సెస్‌, ప్యాషన్‌ ఐటమ్స్‌లను కూడా డిస్కౌంట్‌ ధరలకే కొనుగోలు చేయవచ్చని, అపిల్‌, సామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌, లెనోవో
వంటి మొబైల్‌ ఉత్పత్తుల కంపెనీల నుంచి 40శాతం వరకు తగ్గింపు పొందవచ్చని, అంతేకాక అమెజాన్‌ పే, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌,
డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి పది శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు ఆమెజాన్‌ తెలిపింది.