ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్లు పెంచినా భారత్‌పై భరోసా

RBI
RBI

ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్లు పెంచినా భారత్‌పై భరోసా

ముంబయి, జూలై29: ఫెడ్‌రిజర్వు బాండ్ల కొనుగోల్లు నిలిపివేస్తుందన్న వార్తలతో 2013లో మార్కెట్లను కుదిపివేసిన కాలంలో భారత్‌ కూడా భారీగా నష్టపోయిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఆసమయంలోనే వడ్డీ రేట్లను పెంచి దిగజారుతున్న మార్కెట్లను పరిరక్షించింది. అదేతరహా లో చరిత్ర పునరావృతం అవుతున్నదని అంచనా. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లనుపెంచుతోంది. అలాగే వచ్చేవారంలో భారత్‌ కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందని ఆసియాలోనే మొదటిదేశంగా నిలుస్తుందని అంచనా. అమెరికా రాష్ట్రాలపరంగాచూస్తే పాలసీ రేట్‌ ప్రీమియంతో ఉన్నప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం భారత్‌వైపే చూస్తున్నారు.కరెన్సీ రేట్లపరంగా రూపాయి ర్యాలీతీస్తోంది. దేశంలో జారీ అవుతున్న బాండ్లకు మంచి గిరాకీ లభిస్తోంది.

ఆసియాలో మంచి రిటర్నులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలికంగా చూస్తేఆర్ధిక వ్యవస్థలో ద్రవ్యో ల్బణం గడచిన ఐదేళ్లకాలంలో అత్యంత కనిష్టస్థాయికి చేరింది. ఆర్థికవృద్ధి క్రమేపీ పెరుగుతున్నదని, కరెంటుఖాతాలోటు కూడా అను కున్నస్థాయికి చేరుతున్నదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. జిఎస్‌టి అమలుతో దేశంలోనే అతిపెద్ద ఆర్థికరంగ సంస్కరణలకు తావిచ్చినట్లయింది. లండన్‌ కేంద్రంగా ఉన్న ఓషన్‌ గయల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్త నివేదికప్రకారంచూస్తే భారత్‌లోని నిర్మాణాత్మక సంస్కరణలు పటిష్టంగా ఉన్నాయని విశ్లేషించారు.

భారత్‌ ఇతర వర్ధమాన మార్కెట్లు వచ్చే 12నెలల్లో మరింత వృద్ధిని సాధిస్తాయని అంచనా. విదేశీ పెట్టుబడులతో కూడా భారత్‌ కొంత మూలధన నియంత్రణ చేపట్టింది. డెట్‌రంగంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ కోటాను ఎప్పుడో అధిగమించారు. 21 బిలియన్‌ డాలర్లు డెట్‌రంగంలో పెట్టు బడులుపెట్టారు. జనవరి, జూన్‌ కాలంలో గరిష్టంగా వచ్చాయి. గత ఏడాది ఆరుబిలియన్‌ డాలర్లవరకూ అమ్మకాలు సాగితే ఈ ఏడాది కార్పొరేట్‌ బాండ్‌ కోటా వృద్ధితో ఉంది. షేర్లలో 8.8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.

గతరెండేళ్లలో పెట్టిన 6.3 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక స్థాయిలో చూస్తే భారత్‌ రూపాయి ఆసియా కరెన్సీల్లో మరింత ఎక్కువగా ఉంది. మలేసియా రింగిట్‌తో పోలిస్తే రెట్టింపు మారకం విలువలతో ఉంది. ఆగస్టు 2వ తేదీ ఆర్‌బిఐ సమావేశంలో వడ్డీరేట్ల కోత ఉండవచ్చని ఆష్మర్‌ కేపిటల్‌ ఆర్ధికవేత్త జాన్‌ డెన్‌ అంచనావేసారు. 25బేసిస్‌ పాయింట్లు తగ్గించి ఆరు శాతా నికి తెస్తుందన్న అంచనాతోఉంది. ఆసియాలోనేమొట్టమొదటి బ్యాంకు గా ఆర్‌బిఐ తన మొదటి రేట్‌ కట్‌ను అక్టోబరులో ప్రకటించింది. న్యూజిలాండ్‌కు చెందిన రిజర్వుబ్యాంకు గత ఏడాది డిసెంబరులో వడ్డీరేట్లను కుదించింది.

దీర్ఘకాలిక సులువైన విధానాలతో నేక ఇతర కేంద్ర బ్యాంకులు కూడా ఇదేపంథాలో వెళుతున్నాయి. 2008 ఆర్థిక మాంద్యం దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాతికదికన వడ్డీరేట్ల పెంపు, లేదా తగ్గింపును సిఫారసు చేస్తున్నాయి. అమెరికా వడ్డీరేట్లు పెంచి తే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు తన బాండ్ల కొనుగోళ్లను సడలి స్తుందని ఒక అంచనా. 2013లోనే భారత్‌ అచేతన ఐదుదేశాల్లో ఒకటిగా నిలిచింది. 75 బేసిస్‌ పాయింట్ల వడ్డీరేట్లను పెంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణను కట్టడిచేసింది.

ఇదేబాటలో ఇండోనేసి యా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలు కూడా రక్షణాత్మక వ్యూహాలు అనుస రించి ఆనాడు కట్టడిచేసుకోగలిగాయి. రిటైల్‌ద్రవ్యోల్బణం భారత్‌లో 1.54శాతానికి చేరింది. పదేళ్ల బాండ్ల వడ్డీరేటు 4.9శాతంగా నిలిచింది. ఆసియాలోనే గరిష్టంగా ఉంది. భారత్‌ రూపాయి కూడా డాలరుతో పోలిస్తే 5.6శాతం పెరిగింది. కరెంటుఖాతా లోటు కూడా జిడిపిలో 0.6శాతానికి దిగివచ్చింది. 2013లో 4.8శాతం గా ఉన్న లోటు భారీగా తగ్గింది. విదేశీ కరెన్సీ రిజర్వులు కూడా 389.1బిలియన్‌ డాలర్లకు జులైలో నమోదయ్యాయి.

ఆర్ధికవృద్ధి కూడా 7.3శాతంగా ఉంటుందని రాయిటర్స్‌ వార్తాసంస్థ అంచనాలు వేసింది. ఇందుకోసమేఆర్‌బిఐ, అమెరికా వడ్డీరేట్లపెంపు తగ్గింపు ఆధా రంగా మరింత వృద్ధి నమోదవుతుందని అంతర్జాతీయ ఆర్థికవేత్తలు వేస్తున్నఅంచనాలు సమీపభవిష్యత్తు స్థితగతులను తేటతెల్లంచేస్తాయి.