ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించలేదు: ఏచూరి

Sitaram Yecury
Sitaram Yecury

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కి విభజన చట్టంలో హామీలను అమలు చేయడంలో విఫలమైనందునే టిడిపి ఎన్డీయే నుంచి బయటికి వచ్చేసిందని సిపిఎం సీనియర్‌ నేత సీతారాం ఏచూరి అన్నారు. నేడు పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. తకికన పార్టీలతో పాటు తాము కూడా అవిశ్వాస తీర్మానం పెడుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చ జరగడంలేదని సీతారాం ఏచూరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.