ఫెడరల్‌ ఫ్రంట్‌కు తల ,తోక లేవు

AP Minister Somireddy
AP Minister Somireddy

అమరావతి: తెలంగాణ సియం కేసిఆర్‌ ఏర్పాటు చేస్తానని చెబుతున్న ఫెడరల్‌ ఫ్రంట్‌కు తల ,తోక రెండూలేవని ఏపి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సెటైర్లు విసిరారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేసిఆర్‌, జగన్‌లిద్దరూ ప్రధాని మోది డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని తాము చెప్పిన విషయం నిజమైందని అన్నారు. రైతు సమస్యలపై మోదిని కేసిఆర్‌, జగన్‌ ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. ఏపి ప్రజలను కేసిఆర్‌ ఎంతగా తిట్టారో ఎవరూ మర్చిపోరని వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాన్ని ఆరంభించింది వైఎస్‌ఆర్‌సిపిఅని, జగన్‌, షర్మిలకు తెలంగాణ పోలీసులపై ఎందుంత నమ్మకం? అని ప్రశ్నించారు.