ఫుట్‌బాల్‌ జాతీయ పోటీలకు ఎంపికైన ఆమిద్యాల విద్యార్థినులు

sports11

ఫుట్‌బాల్‌ జాతీయ పోటీలకు ఎంపికైన ఆమిద్యాల విద్యార్థినులు

ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని ఆమిద్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీ లకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగాభవాని, కోచ్‌ మారుతిప్రసాద్‌, పిఇటి రామన్నలు తెలిపిన వివరాల ప్రకారం గత యేడాది డిసెంబర్‌లో తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్‌ బాల్‌ పోటీల్లో అనంతపురం జిల్లా జట్టు విజయం సాధించగా జట్టులో ప్రాతినిధ్యం వహించి అత్యు త్తమ ప్రతిభ కనబరిచిన బి.హేమావతి, ఎ.లావణ్య, బి.వరలక్ష్మిలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక య్యారన్నారు. వీరు త్వరలో పశ్చిమబెంగాల్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారన్నారు. అదే విధంగా ఖేలో ఇండియా పోటీల్లో మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో విజయ పరంపర కొనసాగిం చిన పాఠశాల బాలికల ఫుట్‌బాల్‌ జట్టు శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కడప, తూర్పు గోదావరి, విజయనగరం, నెల్లూరు. గుంటూరు జిల్లాపై విజయం సాధించిందన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పాఠశాలకు చెందిన వై.అనీత, పి.జయలక్ష్మిలు ఫిబ్రవరి 21న చెన్నైలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికయ్యారన్నారు. జిల్లాస్థాయిలో మొదటిసారి విజయం సాధించిన పాఠ శాల ఖోఖోజట్టు కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా పోటీల్లో పాఠశాలకు చెందిన మొత్తం 12మంది సభ్యుల జిల్లాజట్టు ప్రాతినిధ్యం వహించిందన్నారు. పాఠశాలకు చెందిన కవిత, శిరీషా, ధన లక్ష్మి,పవిత్రలు మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారని వివరించారు. విద్యార్థి నులు రాబోవు రోజుల్లోనూ ప్రతిభ కనబరిచి మరింత రాణించాలని అకాంక్షించారు.