ఫీజుల పెంపుపై బిట్స్ విద్యార్ధుల ఆందోళ‌న‌

BITS PILANI CAMPUS, HYD
BITS PILANI CAMPUS, HYD

హైద‌రాబాద్ః బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ (బిట్స్) లో ఫీజుల పెంపునకు నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్, 2018-19 విద్యాసంవత్సరంలో ఫీజులను రెట్టింపు చేయడంపై పిలానీ, గోవా క్యాంపస్ లలో బిట్స్ విద్యార్థులు నిరసన తెలిపారు. సెమిస్టరు ఫీజు రెండులక్షల రూపాయలకు పెంచితే తామెలా చదువుకోవాలని బిట్స్ విద్యార్థి ట్విట్టర్ లో ప్రశ్నించారు. బిట్స్ క్యాంపస్ లో పెంచిన ఫీజులు తగ్గించాలని డిమాండు చేస్తూ నిరసనకు దిగిన విద్యార్థులు సోషల్ మీడియాలోనూ తమ ఆందోళన వ్యక్తం చేశారు.