ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఛైర్మ‌న్‌గా అనుప‌మ్ ఖేర్‌

anupam kher
anupam kher

బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్‌గా నియ‌మితుల‌య్యారు. గ‌తంలో సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్‌, నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామాల‌కు చైర్మ‌న్‌గా అనుప‌మ్ ఖేర్ ప‌నిచేశారు. 62 ఏళ్ల అనుప‌మ్ ఖేర్ సారాంశ్‌, డాడీ, రామ్ ల‌ఖ‌న్‌, దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే వంటి సినిమాల్లో న‌టించారు. 2004లో ప‌ద్మ‌శ్రీ, 2016లో ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుల‌ను అనుప‌మ్ ఖేర్ అందుకున్నారు.