ఫిలిం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం

TALASANI1
Film Journalists Assn. Dairy release Function

ఫిలిం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం

తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌(టీ.ఎఫ్‌.జె.ఎ) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్‌ పిలింఛాంబర్‌ లో జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా తొలి ప్రతిని సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు, మలి ప్రతిని టీ.ఎఫ్‌.జె.ఎ గౌరవ అధ్యక్షులు బి.ఏ రాజు, అధ్యక్షులు రామనారాయణ రాజు స్వీకరించారు. అనంతరం.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ.. సినిమా జర్నలిస్ట్‌ లేకపోతే సినిమా ప్రమోషన్‌ ఉండదు. అందులో వాళ్ల పాత్ర అత్యంత కీలకమైంది. ఈ విషయాన్ని ఇండస్ట్రీల్లో పెద్దలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సినిమా అనే కుటుంబంలో జర్నలిస్టులను కూడా పెద్దలు కలుపుకోవాలి. ప్రబుత్వం నుంచి ఫిలిం జర్నలిస్టులకు అందాల్సిన ప్రోత్సకాలు అందకపోవడం దురదృష్ట కరం. కానీ కొత్తగా ఏర్పాటైన కేసీఆర్‌ ప్రబుత్వం రాగానే జర్నలిస్టులకు 100 కోట్ల బడ్జెట్‌ ప్రవేశ పెట్టాం. కమిట్‌ మెంట్‌ తో మేమంతా పనిచేస్తున్నాం. ఇకపై మీ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం. హెల్త్‌, ఆక్రిడిటేషన్‌ కార్డులను ముందుగా కల్పిస్తాం. రాబోయే కాలంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రబుత్వం ఆలోచన చేసినప్పుడు కచ్చితంగా అందరికీ ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. టీ.ఎఫ్‌.జె.ఎ గౌరవ అధ్యక్షులు బి.ఏ రాజు మాట్లాడుతూ.. తలసాని కి గారికి సినిమాలపై మంచి అభిరుచి అవగాహాన ఉంది. ఇండస్ట్రీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఆయన హాయాంలోనే పరిశ్రమ అభివృద్ది చెందుతుంది అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామనారాయణరాజు, పసుపులేటి రామారావు, ప్రసాదం రఘు, సురేష్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు.