ఫిబ్రవరి 2న గ్రేటర్ పోల్
మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ ప్రకటించిన ఇసి
150 వార్డులకు రిజర్వేషన్లు ప్రకటించిన సర్కార్
హైదరాబాద్‌లో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్
హైదరాబాద్ : హైదరాబాద్ నగర పాలక సంస్థకు సంబంధించిన రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. నెల రోజులుగా పడుతున్న ఉత్కంఠకు తెరపడింది. 150 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. సాయంత్రం ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలు చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన వివరాలను విలేక రుల సమావేశంలో జిహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డితో కలిసి వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 వార్డులకు ఫిబ్రవరి 2వ తేదిన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు, కౌటింగ్ 5వ తేదిన ఉంటుందని స్పష్టం చేశారు. తక్షణమే ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని ఎన్నికల అధికారి నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంతసిబ్బందిని ఉపయోగిస్తున్నారన్న వివరాలను సైతం వెల్లడించారు. అదేవిధంగా ఇప్పటి వరకు రహదారులపై ఉన్న హోర్డింగ్‌లను తొల గించే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అభ్యర్థులకు సంబం ధించి ఖర్చును రూ.5లక్షలుగా నిర్ణయించినట్లు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాత వాటిపై గడువు ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయంటూ ప్రశ్నించినప్పుడు అది తన పరిధిలోకి కాదని, ప్రభుత్వం పరిధిలో ఉందని స్పష్టం చేశారు. ప్రతి కేంద్రాన్ని వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని ఆయన ప్రకటించారు. దీంతో పాటు ఎన్నికల స్లిప్‌లను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునన్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ వివరాలు అన్ని ఉంచామని పేర్కొన్నారు. ఇంటి నెంబర్, ఓటర్ ఐడి నెంబర్ ద్వారా సెర్చ్ చేస్తే అన్ని వివరాలు వస్తాయన్నారు. ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందన్న వివరాలు కూడా తెలుసుకోవచ్చునన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ఒక కిలోమీటర్ దూరంలో ఎన్నికల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు మీడియాతో పాటు స్థానికంగా ఉండే స్వచ్చంద సంస్థల ద్వారా ప్రచారం సైతం నిర్వమిస్తుమన్నారు. మూడు వేల కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీస్తున్నట్లు తెలిపారు. అయితే నామినేషన్ దరఖాస్తులను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని వాటిని ఆర్ఓ వద్ద మాత్రమే సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఈసారి ఎన్నికల్లో 150 స్థానాల్లో 75 స్థానాలు మహిళలు కేటాయించడం గమనార్హం.
జిహెచ్ఎంసి విస్తీర్ణం 650 చదరపు మీటర్లు
మొత్తం ఓటర్ల సంఖ్య 70,67,934
మొత్తం వార్డుల సంఖ్య 150
ఎస్టీ జనరల్ -1 మహిళ-1 మొత్తం-02
ఎస్సీ జనరల్-5 మహిళ-5 మొత్తం-10
బిసి జనరల్-25 మహిళ-25 మొత్తం-50
మహిళ జనరల్ 44
అన్ రిజర్వ్డ్ జనరల్ 44
మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 7,757
పోలింగ్ లోకేషన్ల సంఖ్య 3,117
500 ఓట్ల కన్న తక్కువ పోలింగ్ కేంద్రాలు 165
500 నుంచి 1000 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలు 4,752
1000 నుంచి 1250 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలు 2,318
1250 కంటే అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాలు 522
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1987
హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాలు 867
క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 382
వర్నలుబల్ పోలింగ్ కేంద్రాలు 36
మొత్తం పోలింగ్ కేంద్రాలు 3272
పోలింగ్ సిబ్బంది
ప్రిసైడింగ్ అధికారుల సంఖ్య 7,757
అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల సంఖ్య 7,757
ఇతర పోలింగ్ అధికారులు 23,271 ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు సిబ్బంది
రిజర్వులో పోలింస్ సిబ్బంది 7,760
150 వార్డుల రిసెస్ఫన్లు, డిస్ట్రిబూషన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంలు, కౌటింగ్ హాళ్ల సంఖ్య – 24
రిజర్వేషన్ల వివరాలు
ఎస్టీ జనరల్
వార్డు వార్డు పేరు 1. ఫలకునుమా
ఎస్టీ మహిళ
46 హస్థినాపురం
ఎస్సీ జనరల్
1. కాప్రా
4. మీర్ పేట హెచ్బి కాలనీ
62 జియాగూడ
133. మచ్చబొల్లారం
135 వెంకటాపురం
ఎస్సీ మహిళ
60. రాజేంద్రనగర్
90. కవాడి గూడ
142. అడ్డగుట్ట
144. మెట్టుగూడ
147. బన్సిలాల్‌పేట
బిసీ జనరల్
3. చర్లపల్లి
29. చావని
39. సంతోష్‌నగర్
43. చాంద్రాయణగుట్ట
48. శాలిబండ
51. గోషామహల్
52. పురానాపూల్
53 దూద్‌బౌలి
54. జహనుమా
55. రాంనాస్‌పురా
56. కిషన్‌బాగ్
58. శాస్త్రీపురం
64. దత్తాత్రేయ నగర్
65. కార్వాన్
69. నానల్‌నగర్
70. మెహదిపట్నం
71. గుడిమల్కాపూర్
83 అంబర్‌పేట
88. బోలక్పూర్
103. బోరబండ
112. రాంచంద్రాపురం
113. పటాన్చెరువు
125. గాజుల రామారం
126. జగద్గీర్‌గుట్ట
127. రంగారెడ్డినగర్
బిసీ మహిళ
09. రామంతాపూర్
26 ఓల్డ్ మలక్‌పేట
34. తాలాబ్ చంచల్
35 గౌలిపుర
37. కుర్మగూడ
41. కంచన్‌బాగ్
42. బార్కస్
47. నవాబ్సాహెబ్కుంటా
49 ఘాన్సీ బజార్
57. సులేమాన్‌నగర్
61. అత్తాపూర్
63. మంగల్హాట్
67 గోల్కొండ
68.. టౌలిచౌకి
72. ఆసిఫ్‌నగర్
73. విజయ్ నగర్ కాలనీ
74. అహ్మద్‌నగర్
75. రెడ్‌హిల్స్
76. మల్లేపల్లి
82. గోల్నాక
86. ముషీరాబాద్
101. ఎర్రగడ్డ
128. చింతల్
146. బౌద్దనగర్
148. రాంగోపాల్‌పేట
జనరల్ మహిళ-44
02. డా.ఎఎస్.రావునగర్
06. నాచారం
07. చిలుకానగర్
08. హబ్సిగూడ
10. ఉప్పల్
11. నాగోలు
19. సరూర్‌నగర్
20. ఆర్కెపురం
24. సైదాబాద్
25. ముసారాంబాగ్
28. అజాంపుర
33. మొఘల్‌పుర
38. ఐఎస్ సదన్
66. లంగర్‌హౌజ్
78. గన్‌ఫౌండ్రీ
79. హిమాయగ్నగర్
80. కాచిగూడ
81. నల్లకుంట
84. బాగ్ అంబర్‌పేట
85. అడిక్‌మెట్
89. గాంధీనగర్
91. ఖైరతాబాద్
92. వెంకటేశ్వర కాలనీ
97. సోమాజిగూడ
98. అమీర్‌పేట
100. సనత్‌నగర్
109. హఫీజ్‌పేట
110. చందానగర్
111. భారతినగర్
115. బాలాజినగర్
116. అల్లాపూర్
122. వివేకానంద నగర్ కాలనీ
130. సుభాష్‌నగర్
131. కుత్బుల్లాపూర్
132. జీడిమెట్ల
134. అల్వాల్
136. నేరెడ్మెట్
137. వినాయక్‌నగర్
138. మౌలాలి
141 గౌతంనగర్
143 తార్నాక
145. సీతాఫల్మండి
149. బేగంపేట
150. మోండామార్కెట్
అన్రిజర్వ్డ్
05. మల్లాపూర్
12. మన్సురాబాద్
13. హయత్‌నగర్
14. బిఎన్‌రెడ్డినగర్
15. వనస్థలిపురం
17. చంపాపేట
18. లింగోజీగూడ
21. కొత్తపేట
22. చైతన్యపురి
23. గడ్డి అన్నారం
27. అక్బర్‌బాగ్
30. దబీబ్పుర
31. రెయిన్ బజార్
32. పత్తర్‌ఘాట్
36. లలిత్‌బాగ్
40. రియాసత్‌నగర్
44. ఉప్పుగూడ
45. జంగంమెట్
50. బేగంబజార్
59. మైలార్దేవరపల్లి
77. జాంబాగ్
87. రాంనగర్
93. బంజారాహిల్స్
94. షేక్‌పేట
95. జుబ్లిహిల్స్
96. యూసుఫ్‌గూడ
99. వెంగళరావు నగర్
102. రహమత్‌నగర్
104. కొండాపూర్
105. గచ్చిబౌలి
106. శేలింగంపల్లి
107. మాదాపూర్
108. మియాపూర్
114. కెపిహెచ్బి కాలనీ
117. మూసాపేట
118. ఫతేనగర్
119. ఓల్డ్ బోయిన్పల్లి
120. బాలానగర్
121. కుకట్పల్లి
123. హైదర్‌నగర్
124. ఆల్విన్‌కాలనీ
129. సురారం
139. ఈస్ట్ ఆనంద్‌బాగ్
140. మల్కాజిగిరి