ఫిబ్రవరి 17న ఒక్క గంటలో కోటి మొక్కలు

పోస్టర్ ను విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavita released the poster
MLC Kavita released the poster

Hyderabad: సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్ అందుకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్సీ కవితతో కలిసి విడుదల చేశారు. 

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, తెలంగాణలో పచ్చదనాన్ని మరింతగా పెంచేలానే సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా, ప్రతీ తెలంగాణ జాగృతి కార్యకర్త మొక్కలు నాటాలని కోరారు. తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని  అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ , కిషోర్ మరియు తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ , స్టేట్ సెక్రటరీ మఠం బిక్షపతి , తెరాస నాయకులు దాదాన్నగారి సందీప్ పాల్గొన్నారు.