ఫిబ్రవరి నెలాఖరుకు విత్‌డ్రా ఆంక్షలు ఎత్తివేత!

ఫిబ్రవరి నెలాఖరుకు విత్‌డ్రా ఆంక్షలు ఎత్తివేత!
ముంబై,జనవరి 26: పెద్దనోట్ల రద్దు అనంతరం విడతలవారీగా ఆంక్షలను సడలిస్తున్న భారతీయ రిజర్వు బ్యాంకు వచ్చే నెల చివరినాటికి ఎటిఎం విత్‌డ్రాలపై మొత్తం ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు సమాచారం. వచ్చే నెలాఖరునాటికి స్వేఛ్ఛాయుత లావాదేవీలకు ఆస్కారంకలుగుతుందని కొందరు బ్యాంకర్లు స్పష్టం చేశారు. ఇటీవలేఆర్బిఐ ఎటిఎం విత్‌డ్రా పరిమితిని రూ.10వేలకు పెంచింది. వారంలో 24 వేల రూపా యలకు మించకుండా ఈ విత్డ్రాచేసుకోవచ్చు.
కరెంటుఖాతాలకు అయితే లక్ష రూపాయలవరకూ ఈ విత్‌డ్రా పరిమితిని పెంచింది. ప్రస్తుతం నగదు కొరత,సంక్షోభాలు లేనందున ఆర్బిఐ ఫిబ్రవరినెలాఖరునాటికి మొత్తం విత్‌డ్రాలపై ఆంక్ష లు ఎత్తివేయవచ్చని బ్యాంక్ ఆఫ్మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కె గుప్తా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా అధ్యయనంచేసిన తర్వాత ఆర్బిఐ తననిర్ణయం ప్రకటించవచ్చని స్పష్టం అవుతోంది ఎస్బిఐ రీసెర్చివిభాగం ఎకోరాప్ నివేదిక ప్రకారంచూస్తే 78-88 శాతం కరెన్సీ ఆర్థికవ్యవస్థలో చెలామణిలోనికి వస్తుందని వెల్లడించిం ది. చిన్నమొత్తం నోట్లతో కూడా ఆర్థికవ్యవస్థలో నగదు కొరతను అధిగమించగలమని ఎకోరాప్ సూచిం చింది. దీన్నిబట్టి వచ్చే రెండునెలల్లో సాధారణ స్థితికి చేరుకోగలమని కూడా ఎస్బిఐ రీసెర్చివిభాగం ప్రకటించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంముగిసేలోపు మొత్తం పరిస్థితి సద్దుమణుగుతుందని, సాధారణ స్థితికి వస్తుందని ఆర్బిఐ ఆంక్షలను మొత్తం తొలగించే అవకాశం ఉంటుందని బ్యాంకర్లు దీమా వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందే ఆర్బిఐ విత్‌డ్రా పరిమితులను 4500గా ప్రకటించి తదనంతరం 2500కు తగ్గిం చింది. 50రోజుల పెద్దనోట్లరద్దు ప్రభావంతర్వాత క్రమేపీ సడలించింది ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ మాత్రంనిర్దిష్టమైన కాలవ్యవధిని చెప్పలేకపోతున్నారు. పార్లమెంటరీ స్థాయీసంఘంముందు ఇదేవైఖరి స్పష్టం చేశారు. కేంద్రబ్యాంకు వివరాలప్రకారం మొత్తం 9.2లక్షలకోట్ల కరెన్సీని చెలామణిలోకి తెచ్చినట్లు చెప్పారు.