ఫిదా సెన్సార్‌ పూర్తి: 21న రిలీజ్‌

FIDA-1.1
FIDA

ఫిదా సెన్సార్‌ పూర్తి: 21న రిలీజ్‌

ముకుంద, కంచె వంటి విలక్షణ చిత్రాలతో మెప్పించిన మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా హిట్‌ చిత్రం నిర్మిస్తోన్న చిత్ర ఫిదా. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శేఖర్‌ కమ్ముల నిరాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సెన్సార్‌ జూలై 21న విడుదలవ్ఞతుంది. ఈ సందర్భంగా….నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ మా బ్యానర్‌లో వస్తున్న మరో ఫ్యామిలీ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ఫిదా పాటలకు, ట్రైలర్‌ ఆడియెన్స్‌ నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పురస్కరించుకొని సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు సింగిల్‌ ఆడియో, వీడియో కట్‌ కూడా ఇవ్వలేదు. శతమానం భవతి తర్వాత యూత్‌కు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా ఫిదా మూవీ ఉందని అభినందించారు. సినిమాను జూలై 21న విడుదల చేస్తున్నాం. ప్రత ఒకరు వారి కుటుంబసభ్యులతో కలిసి చూసే సినిమా అని చెప్పగలను అన్నారు.