ఫిక్సింగ్‌ వల్లే పాక్‌ ఫైనల్‌కు చేరిందా?

pakistan
pakistan

ఫిక్సింగ్‌ వల్లే పాక్‌ ఫైనల్‌కు చేరిందా?

ప్రతిష్టాత్మక ఛాంపి యన్స్‌ ట్రోఫీలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం మొద లైంది. టోర్నీలో పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడిందంటూ ఆదేశ క్రికెట్‌ మాజీ సారథి అమిర్‌ సోహైల్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమా రం లేపారు. దీంతో క్రికెట్‌ అభిమానులు ఒక్క సారిగా షాక్‌కి గురయ్యారు. టోర్నీలో భాగంగా పాక్‌-ఇంగ్లాండ్‌ మధ్య తొలి సెమీఫైనల్‌ బుధ వారం జరిగిన సంగతి తెలిసిందే. ఈమ్యాచ్‌ ప్రారంభానికి ముందు పాక్‌కు చెందిన ఓ వార్త సంస్థ చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న అమిర్‌ సొహైల్‌ ఫైనల్‌ చేరిన పాక్‌ జట్టుపై ఆరోపణలు చేశాడు. ఇతరుల కారణంగా (జట్టులో లేనివాళ్లు)నే పాక్‌ టోర్నీలో మ్యాచ్‌లు గెలిచిందని ఆరోపించారు.

ప్రస్తుత జట్టు సారథి సర్పరాజ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడని అన్నారు. మ్యాచ్‌ గెలిచిన అనంతరం సర్పరాజ్‌ మాట్లా డుతూ జట్టులోని ఆటగాళ్ల కృషివల్లే విజయం సాధించామని ఎక్కడా చెప్పలేదు.గమనించండి అని సొహైల్‌ పేర్కొన్నాడు. తమ విజయానికి ఎవరో సాయం చేశారన్న రీతిలోనే సర్పరాజ్‌ ఎప్పుడూ మాట్లాడేవాడన్నారు. దీంతో ఆట వెనుక ఏమి జరిగిందో మేమంతా వూహించగలమన్నారు. జట్టు విజయానికి కారణమేమిటి అని అడి గినప్పుడల్లా…తాము చేసిన ప్రార్థనలు, అభి మానుల మద్ధతు, దేవుడి దయవల్లే అని చెబుతూ వచ్చాడన్నారు. బయటి శక్తుల కారణంగానే పాక్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికైనా మించి పోయింది లేదు…ఇక నుంచి క్రికెట్‌ ఆడండి అని సోహైల్‌ ఈసందర్భంగా జట్టును కోరారు. ఇందుకు సంబం ధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటంతో పాక్‌-ఇంగ్లాండ్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టోర్నీలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హాట్రిక్‌ విజయాలతో సెమీస్‌కు చేరిన ఇంగ్లాండ్‌ను పాక్‌ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. పటిష్టమైన ఇంగ్లాండ్‌ జట్టుపై పాక్‌ విజయం సాధించడంతో సొహైల్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత బలం చేకూర్చాయి.

అయితే దీనిపై తాజాగా స్పందించిన సొహైల్‌ ఈ వ్యా ఖ్యలు పాక్‌-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కి ముందు చేసనవి అని వివరణ ఇచ్చాడు. టోర్నీలో భాగంగా భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఓడి పోవడంతో ఆదేశ మీడియా పాక్‌ జట్టుపై విమ ర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.