ఫిక్షనల్‌ పొలిటికల్‌ డ్రామాగా ‘భరత్‌ అనే నేను..

mahesh babu
mahesh babu

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘ భరత్‌ అనే నేను.. శ్రీమంతుడు, తర్వాత కొరటాల శివతో మహేష్‌చేస్తున్న చిత్రం కావటంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.. రాజకీయ నేపథ్యంలో ఉండనున్న ఈసినిమా కథ సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నడిచే ఫిక్షనల్‌ పొటిటికల్‌ డ్రామాగా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ అనఆనరు.. కాగా శుక్రవారం రిపబ్లిక్‌ డే సందర్భంగా టీం విభిన్నమైన పద్ధతిలో రిలీజ్‌ చేసిన మహేష్‌ ప్రమాణ స్వీకారం అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.. అంతేకాగా మహేష్‌ ఫస్ట్‌లుక్‌ కూడ అందరినీ ఇంప్రెస్‌ చేసింది..డివివి దానయ్య నిర్మిస్తున్న ఈచిత్రాన్ని ఏప్రిల్‌ 27న విడుదల చేయాలని అనుకున్నామన్నారు. ఇందులో మహేష్‌బాబుకు జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ కైరా అద్వానీ నటిస్తోంది. ఈచిత్రం ప్రచారంలో భాగంగా సరికొత్త పంథాను ఫాలో అయింది టీం.. ఫస్ట్‌లుక్‌ పేరుతో మహేష్‌బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న ఆడియోను సోషల్‌ మీడియాలో , ఎఫ్‌ఎం రేడియోల్లో విడుదల చేశారు.. దాదాపు నిమిషం ఉన్న ఈ ఆడియోలో మహేష్‌బాబు తన వాయిస్‌లోని బేస్‌తో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. దీనికి దేవిశ్రీ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మహేష ప్రమాణానికి తోడుకావటంతో ఉర్రూతలూగించింది.. మహేష్‌బాబు ప్రమాణం గంభీరంగా , ప్రొఫెషనల్‌గా ఉంది.. భరత్‌ అనే నేను అంటూ మొదలుపెట్టి దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ మహేష్‌ ముగిస్తాడు.. ఇప్పటికే మహేష్‌ ప్రమాణం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.