ఫాస్ట్‌ఫుడ్‌ ప్రభావం

                       అమ్మాయిల‌పై ఫాస్ట్‌ఫుడ్‌ ప్రభావం

LADY
LADY

సాధికి ఇంట్లో ఫుడ్‌ అస్సలు ఇష్టం ఉండదు. స్కూలుకు వెళ్తున్నప్పుడు, వస్తున్నపుడు ఫాస్ట్‌పుడ్‌లో కేకులు, బర్గర్లు, పిజ్జాలు తింటుంది. రాత్రి ఇంటికి వచ్చాక ఇంకేమీ తినకుండానే పడుకుంటుంది. తల్లి ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా ఆమె అలవాటు మానుకోలేదు. దీంతో సాధి 10 సంవత్సరాలకే మెచ్యూర్‌ అయ్యింది. తల్లి కంగారుకు అంతులేదు. ఇలా ఎందుకు జరిగిందని గైనిక్‌ డాక్టర్‌ను కలిస్తే, కారణం ఆమె ఫాస్ట్‌పుడ్‌ అలవాటేనని చెప్పింది. నిజమే ఫాస్ట్‌పుడ్‌, కాలుష్యం, అధిక ఒత్తిడి ఇవన్నీ ఆడపిల్లల్లో తీవ్రప్రభావాలు చూపుతున్నాయి.

ఈరోజుల్లో అమ్మాయిలు త్వరగా మెచ్యూర్‌ అవ్ఞతున్నారు. త్వరగానే మెనోపాజ్‌కి చేరుకుంటున్నారు. పదమూడేళ్లకు అటుఇటుగా ఉండే ఈ వయసు ఇప్పుడు మరింత తగ్గిపోయింది. కొంతమంది మరీ చిన్నతనంలోనే అంటే తొమ్మిది, పదేళ్లకు కూడా రజస్వల అవుతున్నారు. ఇలాంటి పిల్లలు, వీరి తల్లిదండ్రులు కొన్నాళ్లపాటు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవటం మామూలే. ఈ పిల్లల విషయంలో తల్లిదండ్రులు గుర్తుంచుకుని పాటించాల్సిన కొన్ని సూచనలు-
రజస్వల అయిన సమయంలో, ఆ తరువాత పీరియడ్స్‌లోనూ నొప్పి, అధికరక్తస్రావం వంటి సమస్యలు ఉంటే ఈ పిల్లల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిల్లలకు ఏమాత్రం అలాంటి విషయాల పట్ల అవగాహనలేని వయసులో మెచ్యూర్‌ కావటం వారిలో అయోమయం, కంగారు, భయాలకు గురిచేస్తుంది. అంతేకాదు ఒకలాంటి ఒంటరితనం దిగులు వారిని ఆవరించే ప్రమాదమూ ఉంది. మరీ తొమ్మిది, పదేళ్ల వయసులోనే మెచ్యూర్‌ అయిన పిల్లలకు ఈ మార్పులు తట్టుకునే శక్తి ఉండదు. నిన్నటివరకు ఎగురుకుంటూ వెళ్లి నాన్న ఒళ్లో కూర్చున్న చిట్టితల్లి ఒక్కసారిగా పెద్దదానిలా ప్రవర్తించాలంటే కుదరదు కదా. తల్లిదండ్రులు చదువుకున్నవారయి, ఈ తరుణంలో పాటించే పాత సిద్ధాంతాల పట్ల నమ్మకంలేని ఇళ్లలో అయితే పరవాలేదు.

కానీ గ్రామీణ వాతావరణంలో పెరుగుతున్న పిల్లలు అయితే తప్పకుండా ఈ మార్పుని త్వరగా జీర్ణం చేసుకోవాల్సిందే. అమ్మమ్మ, నాన్నమ్మల మధ్య పెరుగుతున్న పిల్లల్ని స్వేచ్ఛగా ఆడుతూపాడుతూ తిరగకుండా కట్టడి చేయటం మరింత ఎక్కువగా ఉంటుంది.ఒక సహజ శారీరక పరిణామక్రమమైన ఈ పెరుగుదల అంతే సహజంగా ఆడపిల్ల జీవితంలోకి ప్రవేశించాలంటే ఆమెకు ఈ విషయాల పట్ల ఆరోగ్యకరమైన, శాస్త్రీయపరమైన అవగాహనని కల్పించడం అత్యవసరం. పాఠశాలల్లో లైంగిక విద్యాబోధన గురించి ఇంకా తర్జన భర్జనలు, మంచిదా, కాదా అనే భిన్నాభిప్రాయాలు మనచుట్టూ ఉన్నాయి. అయితే ఈ విషయంమీద అమ్మాయిలకు సరైన అవగాహనను కల్పించాల్సిన మొదటి బాధ్యత తల్లిమీద ఉంటుంది.

తల్లికి ఈ విషయం పట్ల ఉన్న దృక్పథమే ఆమె పిల్లల్లోనూ పెరుగుతుంది. మనలో చాలా వరకు దీనిని యవ్వనానికి సూచనగా తీసుకుంటారు కానీ వయసురీత్యా జరిగే శారీరక ప్రక్రియల్లో భాగంగా తీసుకోరు. ఇప్పటికీ పల్లెల్లో ఈ సమయంలో ఇంట్లోకి రాకుండా దూరంగా ఉండేవారు ఉన్నారు. దీనిని అసహజంగా తీసుకుంటూ ఆ మూడురోజుల్ని చాలా ఇబ్బందికరంగా ఎప్పుడెప్పుడు అయిపోతాయా అనే భావంతో ఎదుర్కొనేవారూ ఉన్నారు. శారీరక ఇబ్బందుల రీత్యా అయితే ఫరవాలేదు, మానసికంగా ఈ పరిస్థితిని ఇబ్బందిగా భావించడం మాత్రం మంచి ఎదుగుదలగా చెప్పలేము.

శరీరాన్ని, దాని సహజ ధర్మాలను అర్థం చేసుకోవటం, వాటికి విలువ నివ్వటం, గౌరవించడం ఇవన్నీ ఆడపిల్ల ఆత్మగౌరవంలో భాగాలే అవుతాయి. అపుడే వాళ్లకు తమని తాము గౌరవించుకోవటం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం- ఇవన్నీ అలవాటు అవుతాయి. ఈ కాలంలో చాలా త్వరగా ఆడపిల్లలు రజస్వల అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని తల్లులు గుర్తుంచుకోవాలి. అందుకు అనుగుణంగా వారు పిల్లల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయాలి.
్య ఇంకా చిన్నపిల్లలే కదా అని వారి ముందు ఈ విషయాలు ప్రస్తావించకూడదు అనే భావంతో ఉండకూడదు.
్య తొమ్మిది, పదేళ్ల వయసులో పిల్లలకు ఈ శారీరకమార్పుని గురించి చెప్పవచ్చు. ఆ సమయంలో ఏం జరుగుతుందో తల్లి సునిశితంగా వివరించవచ్చు.
్య తల్లి తాను ఉపయోగిస్తున్న ప్యాడ్స్‌ని చూపుతూ వివరించినా పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారు.
్య ఇదంతా చాలా సహజ శారీరక ధర్మంగా వారికి అర్థం కావాలి. ప్రతి అవయవానికి కొన్ని విధులు ఉంటాయి కదా అని మొదలుపెట్టి, కన్ను, ముక్కు, చెవులు, కాళ్లు, చేతులు ఇవన్నీ మనం వివిధ పనులు చేసుకోవ డానికి వీలుగా తమ ధర్మాలు నిర్వర్తిస్తున్నాయి కదా అలాగే లోపల కూడా కొన్ని అవయవాలు ఉంటాయి అని కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు మొదలైన వాటిని వాటి ధర్మాలను వివరిస్తూ అదే క్రమంలో గర్భసంచి గురించి చెప్పవచ్చు. దాని ధర్మాలు వివరించవచ్చు. అన్ని అవయవాలు తమ తమ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాయో ఇదీ అలాగే తన పని తాను చేస్తుం దనీ అందుకే ఇలా అవుతుందనీ చెప్పాలి.
్య పిల్లలు మరీ చిన్నగా ఉన్నపుడే మెచ్యూర్‌ అయితే వారికి మరింత సున్నితంగా ఈ విషయాలు చెప్పాలి.
్య మీ చుట్టుపక్కల, బంధువుల్లో ఉండే అమ్మాయిల్ని ఉదహరిస్తూ అందరికీ ఇలాగే అవుతుంది, నీకొక్కదానికే కాదు అని విషయాన్ని తేలికపరుస్తూ చెప్పాలి.
్య ‘మా పాపకి ఇన్నేళ్లే, ఇలా అయిపోయింది అని పిల్లల ముందే బాధపడటం, విషయాన్ని విచిత్రంగా చేసి చెప్పటం చేయకూడదు. మీరు బాధపడుతున్నారనిపిస్తే పిల్లలకు అది భయపడే విషయంగా కనిపిస్తుంది.
్య ముఖ్యంగా దీనితో ముడిపడి ఉండే పెద్దరికాన్ని వారికి త్వరగా ఆపాదించేయాలనే కంగారుని అసలు ప్రదర్శించకూడదు. అలా చేస్తే చిన్నపిల్లలు ఈ విషయంపట్ల పూర్తి నెగెటివ్‌ అభిప్రాయాలు ఏర్పరచుకునే అవకాశం ఉంది. అమ్మాయిలు మరీ చిన్నవయసులో రజస్వల అవుతున్న పరిస్థితుల్ని కొంతమంది గైనకాలజిస్టులు ఇలా విశ్లేషిస్తున్నారు.
్య ఆడపిల్లలు ఇటీవల కాలంలో చిన్న వయసులోనే మెచ్యూర్‌ అవటం ఎక్కువగా కనబడుతోంది. వెనుకటి కాలంతో పోల్చి చూసినపుడు దీనికి కారణం ఇదని కచ్ఛితంగా చెప్పలేము కానీ ఆలోచించి చూస్తే రెండు కారణాలు మన దృష్టికి వస్తాయి. వీటిలో మొదటిది న్యూట్రిషన్‌ మెరుగుపడటం. ఆడపిల్లలు చిన్నతనంలోనే రజస్వల కావటమనే పరిస్థితి పట్టణాల్లోనూ, కొద్దోగొప్పో ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లోనూ ఎక్కువగా కనబడుతోంది. ఇటువంటి కుటుంబాల్లో నెలసరి ఆదాయం పెరగటం, పోషకవిలువలు ఎక్కువగా ఉన్న ఆహారం సమృద్ధిగా లభించడం జరుగుతోంది.

గ్లోబలైజేషన్‌ ఫలితంగా ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఈ పరిస్థితులన్నింటి వలన కూడా పిల్లల్లో పెరుగుదల త్వరితగతిన జరుగుతుండవచ్చు. ఇకపోతే రెండవకారణం- పిల్లల జీవితంలో ఈ మధ్యకాలంలో బాల్యం బాగా కుచించుకు పోయింది. ఇది వరకు కనీసం ఐదుసంవత్సరాలు నిండితేగాని బడికి పంపేవారు కాదు. అదే ఇప్పుడైతే పుట్టి ఏడాది తిరక్కుండానే పిల్లల్ని స్కూలు పేరుతో బయటకు పంపేస్తున్నారు. ఇక రెండో ఏడు నిండేసరికి ఫుల్‌డే స్కూలు, పరీక్షలు- ఇవన్నీ మామూలైపోయాయి. ఇవన్నీ పిల్లల్ని విపరీతమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తుండటం వలన హార్మోన్ల విడుదల త్వరితంగా జరుగుతుండవచ్చు. ఏదిఏమైనా ఈ కాలంలో పెరుగుతున్న జీవన వేగానికి ఇది కూడా ఒక నిదర్శనంగా భావించవచ్చు.