ఫార్మాసిటీకి సన్నాహాలు

 

kcr
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఫార్మారంగం అభివృద్ది సర్కారు చర్యలు తీసుకుంటోంది. 12 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు కోసం అవసరమమ్యే సమ్రగ నివేదిక తయారు చేయాలని సిఎం కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. ఫార్మా పరిశ్రమలతోపాటు , వర్సిటీని కూడ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఫార్మా పరిశ్రమల వద్ల కాలుష్య సమస్యలు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమెరికా, జపాన్‌, యూరప్‌ దేశాల్లో పర్యటించి అక్కడ వ్యర్థాల సమగ్ర నివారణ కోసం అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలని కూడ ఆయన సూచించారు.