ఫస్ట్‌లుక్‌ ‘అదిరింది’

VIJAY
VIJAY

ఫస్ట్‌లుక్‌ ‘అదిరింది’

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజ§్‌ు నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం ‘అదిరింది. ఈచిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.. ‘అదిరింది అనే టైటిల్‌ విజ§్‌ుకుసరిగ్గా సరిపోతుందనే కామెంట్స్‌ వస్తున్నాయి.. విజ§్‌ు అభిమానులతోపాటు తెలుగు, ప్రేక్షకులు , సినీ వర్గాలు ఈ టైటిల్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.. ఈ ప్రాజెక్టును మురళీ రామస్వామి, హిమా రుక్మిణి, తెన్నాండల్‌ స్టూడియోస్‌ ప్రై.లి. సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఆస్కార్‌ విన్నర్‌ ఎఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.. తెన్నాండల్‌ స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి తెలుగులో ‘అదిరింది చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మురళీ రామస్వామి మాట్లాడుతూ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ అధినేత శరత్‌ మరార్‌తో కలిసి తెన్నాండల్‌ స్డూడియోస్‌ తెలుగుప్రేక్షకులకు ఈచిత్రాన్ని అందించనున్నామని తెలిపారు. శరత్‌మరార్‌ ఈ ప్రాజెక్టులోజాయిన్‌ కావటంతో ఆనందంగా ఉందన్నారు..శరత్‌ మరార్‌మాట్లాడుతూ, విజ§్‌ు 61వ చిత్రం , తెన్నాండల్‌ స్టూడియోస్‌ వందో చిత్రం ‘అదిరింది సినిమాతో అసోసియేట్‌ కావటం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్టును తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం.. విజ§్‌ుకు తెన్నాండల్‌ స్టూడియోస్‌కు , డిస్ట్రిబ్యూటర్స్‌కు ల్యాండ్‌ మార్క్‌ సినిమాగా ఉంటుందనిఆశిస్తున్నానని అన్నారు. విజ§్‌ుతోపాటు ఎస్‌జె సూర్య, కాజల్‌ అగర్వాల్‌, సమంత, నిత్యామీనన్‌, వడివేలు, కోవై సరళ, సత్యన్‌, సత్యరాజ్‌లు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. ఇండయాలోనే పలు అందమైన ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈచిత్రం ఆడియోను ఆగస్టులో రిలీజ్‌ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.. అక్టోబర్‌లో ఈచిత్రాన్నిభారీగా విడుదల చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.