ఫలితాల విడుదలలో తొందరెందుకు?

ప్రజావాక్కు

Neet Results-2
Neet Results- (FILE)

ఫలితాల విడుదలలో తొందరెందుకు?: -జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్లా

ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. పరీక్షా ఫలితాలను అతి తక్కువ సమయంలో వెల్లడిస్తామని సంబంధిత అధికారులు ప్రకటి స్తున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు దీర్ఘకాలం పాటు ఎదు రుచూడకుండా తక్కువ సమయంలో ఫలితాలను వెల్లడిస్తా మని భావించడం సంతోషదాయకమే. కానీ ఆ హడావ్ఞడిలో ఏమైనా పొరపాట్లు జరిగితే పలు సమస్యలు ఉత్పన్నమవ్ఞతా యి. సమాధాన పత్రాలు మూల్యాంకనంలో గాని, ఆ తరు వాత మార్కులను, గ్రేడులను కంప్యూటర్లలో ఫీడ్‌ చేయడంలో గానీ తప్పులు దొర్లితే అది విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా పరిణమించే ప్రమాదం ఉంది. గతంలో ఇలాంటి త ప్పు జరగడంవల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్మీడియెట్‌ బోర్డు చుట్టూ తిరగాల్సి వచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అత్యంత అప్రమత్తంగా బాధ్యతలను నిర్వ హించాల్సిన అవశ్యకతను అధికారులు గుర్తించాలి.

పెరుగుతున్న హింస:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

కాశ్మీర్‌లోయలోహింస రోజురోజకూ పెరిగిపోతుండడం ఆందో ళన కలిగించే అంశం. అక్కడ యువతను లోబరుచుకొని ఉగ్ర వాదులు హింసాత్మక ఘటనలకు ప్రేరేపిస్తున్నారు. కొందరు మతపెద్దలు మిగతా మతస్థులపై దాడులకు పథకరచన చేస్తు న్నారు. ఇటీవల పాకిస్థాన్‌ ఉగ్రమూకలు దాడి చేసి పట్టపగలు ఆస్పత్రి నుండి తమ సహచరుడిని విడిపించుకు వెళ్లిన ఘటన భారతీయ భద్రతా వ్యవస్థలోని లోపాలను బయటపెట్టింది. నిఘావర్గాల కంటే ముందుగా సమాచారం పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులకు అందుతుండడం ఆందోళన కలిగించే విషయం. కేంద్రం నుడి ఒట్టి హామీలు తప్ప ఏదశలోనూ ఉదార ఆర్థిక సహాయం అందకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం సైతం అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక నిస్సహాయంగా చూస్తోంది.
ఖాళీలను భర్తీ చేయాలి: సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

రాష్ట్రంలో అనేకవిభాగాలలో నెలనెలా ఎంతోమంది ఉద్యో గులు పదవీ విరమణ పొందుతున్నారు. ఆ ఖాళీలను నెల ల తరబడి అలానే ఉంచితే అభివృద్ధి కుంటుపడుతుంది. ఎప్పటి ఖాళీలను అప్పుడే పదోన్నతుల ద్వారా, నూతన నియామకాల ద్వారా వెంటనే భర్తీ చేస్తే బాగుంటుంది. ఉ దా.ఉపాధ్యాయులు పదవీ విరమణపొందుతుంటే ఆ ఖాళీ లను అలానే ఉంచడంవలన విద్యార్థులు ఆయా సబ్జెకుల్లో రాణించలేకపోతున్నారు.అందుకే ఖాళీలను భర్తీ చేయాలి.
గురుపత్ని పథకం: -బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

గురుపత్ని పథకం పేరిట అర్చకులను వివాహమాడే వధువ్ఞకు యాభైవేల రూపాయలు కానుకగా ఇవ్వాలని అందుకోసం బడ్జె ట్‌లో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 75 కోట్లు కేటాయిస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అమలులోనికి తెచ్చింది. నిజానికి ఇది సంక్షేమ పథకమా? సంక్షోభ పథకమో అర్థంకా కుండా ఉంది. ఇది ఏదో ప్రత్యుపకారాన్ని ఆశించి ప్రవేశపెట్టిన పథకంగానే తప్ప ఇందులో సంక్షేమం ఏదీ కానరావడం లేదు. నిజానికి సంక్షేమ పథకాలు బలహీనవర్గాలను ఆర్థికంగా ఆదు కోవడం కోసం వారి అభివృద్ధి కోసం ప్రవేశపెడుతుంటారు. కానీ గురుపత్ని పథకంలో సంక్షేమం ఏమీ కనబడడం లేదు.

కాలుష్యాన్ని నివారించాలి: -కె.శివసాయి, హైదరాబాద్‌

దేశంలో జనాభా నానాటికీ పెరుగుతోంది.అందువల్లరోడ్ల మీద వాహనాల రాకపోకలు విపరీతమయ్యాయి. దీనికితోడు ఎటు చూసినా వాతావరణ కాలుష్యం తాండవిస్తోంది. ప్లాస్టిక్‌ సంచు ల వాడకం ఎక్కువ కావడం, పాలథిన్‌ వ్యర్థాలను ఎక్కడికక్క డ పడేయడం వల్ల పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయి. ప్లాస్టిక్‌ చెత్తను కాల్చేస్తున్నారు. వీటివల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. చిత్తశుద్ధి అనేది చేతల్లో కనిపిస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవ్ఞతుంది.

స్టాంపుల కొరతతో సమస్యలు: -చెన్నుపాటి రామారావు, విజయవాడ

స్టాంపుల కొరత షరామామూలే అవ్ఞతోంది. ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండాల్సిన స్టాంపులు కొరతల జాబితా నుంచి తొలగడం లేదు. ప్రతి లావాదేవీకి తప్పని సరైన స్టాంపుల లభ్యతకు,ముందుచూపులేకపోవడం,ని ల్వలపై జాగరూక చర్యల్లేక జనం ఎంతో కొంత అదనంగా భరించాల్సివస్తోంది. బ్లాకులో కొనక తప్పడం లేదు. మం డల కేంద్రాల్లో స్టాంపులుదొరక్క వ్యవహారాలన్నీ ఆగుతున్న సంఘటనలు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడవ్ఞతున్నది.

సమన్వయ లోపం:-పి.రామచంద్రమూర్తి, నల్గొండ

ప్రభుత్వ యంత్రాంగం, ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీల మధ్య సమ న్వయ లోపం కారణంగా నల్గొండ జిల్లాలో పేద విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం నాణ్యత లేకుండాపోయింది. ఆరు నెలల పాటు బిల్లు ఇవ్వనందుకు ప్రభుత్వ అధికారులలో అవి నీతి, బిల్లులో కోతలు ఇత్యాది కారణాల వలన భోజన సరఫరా పట్ల ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీలు నిర్లక్ష్యవైఖరి కనబరుస్తున్నాయి.