‘ఫలక్‌నుమా దాస్‌’

vishwaksen
vishwaksen

వినూత్నమైన కాన్సెప్ట్‌తో సక్సెస్‌లు సాధించిన వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది.. లాంటి చిత్రాల్లో నటించిన విశ్వక్‌సేన్‌ హీరోగా , స్వీయ దర్శకత్వంలో కరాటే రాజు నిర్మాతగా, వన్‌మాయే క్రియేషన్స్‌ పై విశ్వక్‌సేన్‌ సినిమాస్‌, టెరనోవ పిక్చర్స్‌ అనుసంధానంతో మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ఫలక్‌నుమా దాస్‌.. ఈసినిమా పూర్తిగా హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం.. ఈచిత్రంలో సలోని మిశ్రా, హర్షిత గౌర్‌, ప్రశాంతి ఫిమేల్‌ లీడ్‌ క్యారెక్టర్లలో కన్పిస్తారు. 3 రోజుల మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకుంది.. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ ముఖ్యపాత్రలో నటించారు. క్రిస్మస్‌ కానుకగా చిత్రం మొదటి లుక్‌ను విడుదల చేశారు. డైనమిక్‌ డైరెక్టర పూరీ జగన్నాధ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిర్మాత కరాటే రాజు మాట్లాడâత, విశ్వక్‌సేన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తనే హీరోగా చేస్తున్న చిత్రమన్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీతో కలిపి దాదాపు 118 లొకేషన్లలో ఈచిత్రాన్ని షూట్‌ చేశామన్నారు. ఈచిత్రం హైదరాబాద్‌ బేస్డ్‌ స్టోరీ కావటంతో ఇక్కడ నేటివిటీ, కల్చర్‌న కలర్‌ఫుల్‌గా చూపించామన్నారు. యూనిట్‌ అంతా కష్టపడి పనిచేసిందని, వారి కష్టాన్ని మించి అవుట్‌పుట్‌ రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు.