ఫరూక్‌ అబ్దుల్లాపై క్రికెట్‌ కుంభకోణం కేసు

FAROOQ ABDULLAH
FAROOQ ABDULLAH

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దులాపై సిబిఐ కేసు నమోదుచేసింది. జమ్ముకాశ్మీర్‌క్రికెట్‌ సంఘం కుంభకోణంలో ఆయనప్రమేయం ఉందని వెల్లడించింది. ఈకుంభకోనంలో రూ.113కోట్ల అవినీతి జరిగిందని సిబిఐ ప్రాథమికంగా నిర్ధారించింది. ఫరూక్‌తోపాటుమరో ముగ్గురిపై ఐపిసి సెక్షన్ల ఆధారంగా నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం వంటి నేరాలపై కేసులునమోదుచేసింది. రణబీర్‌ పీనల్‌కోడ్‌ సెక్షన్ల ఆధారంగా నేరపూరిత కుట్ర జరిగిందని ఆరోపించింది. ఆసమయంలో క్రికెట్‌ సంఘానికి అబ్దుల్లా అధ్యక్షునిగా ఉన్నారు. రాష్ట్ర క్రికెట్‌సంఘంలో వెల్లువెత్తిన ఈ ఆరోపనలు 2001నుంచి 2011 మధ్యకాలంలో వచ్చాయి. సుమారు 113 కోట్ల రూపాయలు నిధులు దారిమళ్లినట్లు జెకెసిఎ పాలకవర్గసభ్యులు ఈ నిధులను దుర్వినియోగంచేసినట్లు ఫిర్యాదులు అందాయి. సిబిఐ అబ్దుల్లా వాంగ్మూలాన్ని సైతం నమోదుచేసింది. జమ్ముకాశ్మీర్‌ హైకోర్టు గడచిన నవంబరులో సిబిఐను ఈ దర్యాప్తును మూడునెలల్లోపు పూర్తిచేయాలని కూడా ఆదేవించింది. అబ్దుల్లాతోపాటు జెకెసిఎ ప్రధాన కార్యదర్శి సలీమ్‌ ఖాన్‌, కోశాధికారి మహ్మద్‌ అశన్‌ మీర్జా, జెఅండ్‌కె బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ బషీర్‌ అహ్మద్‌ మాన్సిర్‌లను ఛార్జిషీటులో నిందితులుగా పొందుపరిచింది.