ఫండ్స్‌ పెట్టుబడులకు ఈ సంస్థలు భేష్‌!

MUTUAL FUNDS
MUTUAL FUNDS

న్యూఢిల్లీ: దీర్ఘకాలిక మూలధర ఆదాయపు పన్నుతో వాటిల్లిన నష్టాలను సరిచూసుకున్న తర్వాత మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు కొన్ని ఈక్విటిల్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమాయ్యరు. రానున్న కొన్ని సంవత్సరాలను ప్రాతిపదికగా తీసుకుని మంచిలాభాలు పంచవచ్చనే అంచనాతో కొన్ని కంపెనీలను ఎంచుకున్నారు. ఏఐఏ ఇంజినీరింగ్‌ పెట్టుబడి పెట్టిన ఫండ్‌: డిఎస్‌పి బ్లాక్‌ రాక్‌ మ్యూచువల్‌ ఫండ్‌, సిఎంసి: రూ.1417, మార్కెట్‌ కేపిటలైజేషన్‌: రూ.13366కోట్లు, ఎఐఎ ఇంజినీరింగ్‌ సంస్థ సిమెంట్‌, మైనింగ్‌ ప్లాంట్లతో పాటు థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో మెటీరియల్‌ క్రష్‌ చేయడానికి, గ్రైండింగ్‌ చేయడానికి అవసరమైన పరికరాలను తయారేచేస్తుంది. మైనింగ్‌, సిమెంట్‌ ఇండస్ట్రీల్లో డిమాండ్‌ పెరుగుతుందనే అంచనా ఉంది. ఈ రెండు రంగాల్లో డిమాండ్‌ 25 లక్షల టన్నుల మేరకు పెరగవచ్చని అంచనా. అందులో 15లక్షల టన్నుల నుంచి 20లక్షల టన్నుల సరుకు వరకూ మైనింగ్‌ రంగం నుంచే ఉంటుందని ఈ రంగాన్నిపరిశీలిస్తున్నవారు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎఐఎ ఇంజినీరింగ్‌ విషయానికి వస్తే సామర్థ్యంలో 65శాతం మాత్రమే వినియోగం అవుతోంది. 2020 నాటికి ఎఐఎ హై క్రోమియం భాగాల ఉత్పత్తి సామర్థ్యాన్ని 4,40,000టన్నులకు చేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సామర్థ్యం ఇప్పుడు 3,40,000టన్నులు మాత్రమే ఉంది. మైనింగ్‌ రంగంలోనుంచి వస్తోన్న ఆర్డర్లను అందిపుచ్చుకోవడం ఎఐఎ ఇంజినీరింగ్‌ ముందు ఉంటుందని అంచనా.
ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌ పెట్టుబడి పెట్టిన ఫండ్‌: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, సిఎంపి: రూ.658, మార్కెట్‌ కేపిటలైజేషన్‌: రూ.8175కోట్లు దేశంలోనే అతిపెద్ద పివిసి పైపులు తయారు చేసే ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌ 2020 నాటికి ఉత్పత్తి సామర్థ్యం పెంచే వ్యూహాల్లో ఉంది. తయారు చేసిన మొత్తం పైపుల్లో 70శాతం వ్యవసాయరంగంలో విక్రయిస్తుండగా, మిగిలిన ఉత్పత్తులు ఇతర రంగాల్లో అమ్ముతోంది. ఫినోలెక్స్‌కి దేశవ్యాప్తంగా 800డీలర్లు, 18వేల రిటైలర్లతో బలమైన నెట్‌వర్క్‌ కలిగి ఉంది. కంపెనీకి కస్టమర్లుగా వ్యవసాయ, గృహ, టెలికమ్యూనికేషన్స్‌, నిర్మాణ రంగంలోని కంపెనీలు ఉన్నాయి. ప్రధాన మంత్రి కృషి సంచా§్‌ు యోజన్‌, అందరికీ ఇళ్లు వంటి పథకాలతో తమ ఉత్పత్తుల వాడకం పెరుగుతుందని ఫినోలెక్స్‌ అంచనా వేస్తోంది. అందుకే తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో, ఆదాయం పెరుగుతుందని భావిస్తోంది.
ఎల్‌అండ్‌టి ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌
పెట్టుబడి పెట్టిన ఫండ్‌: ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌, సిఎంపి: రూ.166, మార్కెట్‌ కేపిటలైజేషన్‌: రూ.33247కోట్లు వివిధ రంగాల్లో వ్యాపారం చేస్తోన్న ఎల్‌అండ్‌టి ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ రిటన్‌ ఆన్‌ ఈక్విటీ అంశంపై దృష్టి కేంద్రీకరించింది. ఖర్చు తగ్గించుకునేందుకు పోర్ట్‌ఫోలియోలోని ఉత్పత్తులను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 16శాతం రిటన్‌ ఆన్‌ ఈక్విటీ సాధించింది. ఇది గత ఏడాది అదే సమయంతో పోల్చితే 12.8శాతం మాత్రమే ఉండటం గమనార్హం. హోల్‌సేల్‌ వ్యాపారంలో పెరుగుతున్న మొండిబకాయిలను తగ్గించే వ్యూహం కూడా ఎల్‌అండ్‌టి హోల్డింగ్స్‌ సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. తొందర్లోనే కంపెనీ టర్న్‌అరౌండ్‌ కావచ్చని అంచనా.
సుదర్శన్‌ కెమికల్స్‌
పెట్టుబడి పెట్టిన ఫండ్స్‌: ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, సిఎంపి: రూ.508, మార్కెట్‌ కేపిటలైజేషన్‌: రూ.3509కోట్లు రసాయనాల విభాగంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న సుదర్శన్‌ కెమికల్స్‌కి ఈ రంగంలో 35శాతం వాటా ఉంది. అజోపిగ్మెంట్స్‌ హై మార్జిన్‌ ఉత్పత్తులను విక్రయిస్తోన్న సుదర్శన్‌ కెమికల్స్‌ యూరప్‌, నార్త్‌ అమెరికాలోనూ తన వ్యాపారం పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఖరీదైన ఉత్పత్తులవైపు మళ్లడం, భారీ డిస్ట్రిమ్యూషన్‌ నెట్‌వర్క్‌ కలిగి ఉండటం సుదర్శన్‌ కెమికల్స్‌ ఆదాయానికి దోహదపడుతుందని అంచనా.
నెస్లే ఇండియా
పెట్టుబడి పెట్టిన ఫండ్‌: ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌, సిఎంపి: రూ.8692, మార్కెట్‌కేపిటలైజేషన్‌: రూ.83807కోట్లు మ్యాగీ నూడుల్స్‌ విభాగంలో భారీగా వృద్ధి నమోదు చేస్తోన్న నెస్లే ఇండియా విక్రయాల్లో కూడా సుస్థిరమైన వృద్ధి నమోదు చేస్తోంది. జిఎస్‌టిలో తగ్గింపు లభ్యం కావడం కూడా ప్లస్‌పపాయింట్‌గా చూడాలి. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ పెరగడం కొత్త ప్రొడక్ట్స్‌ లాంఛ్‌ చేయడం కూడా నెస్లే ఇండియా వ్యాపారానికి కలిసి వస్తోంది.