ప‌.గోదావ‌రి జిల్లాలో ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌యత్నం!

sucide attempt copy
sucide attempt

పశ్చిమగోదావరి: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం సంఘ‌ట‌న టి.నరసాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెంలో కలకలం రేపింది. పోలీస‌లు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం గ్రామానికి చెందిన నెల్లూరి పవన్‌, కాకిలేటి కిరణి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే పవన్‌ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం కిరణికి తెలిసింది. మనోవేదనకు గురైన ఆమె పవన్‌కు ఫోన్‌ చేసి బొర్రంపాలెం వచ్చింది. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన పవన్‌ తనపై ఎక్కడ కేసు అవుతుందోననే ఆందోళనతో తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.