ప‌వ‌న్ మూడు రోజుల పాటు అనంత‌లో ప‌ర్య‌ట‌న‌

Pawan Kalyan
Pawan Kalyan

హైద‌రాబాద్ః జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శనివారం నుంచి అనంతపురం జిల్లాలో కరువు యాత్ర పేరుతో మూడు రోజులు పర్యటించనున్నారు. జిల్లాలో కరువుపై అధ్యయనం చేయనున్నారు.రేపు మధ్యాహ్నం అనంతపురం జిల్లా గుత్తి రోడ్డులో జనసేన కార్యాలయానికి భూమిపూజ చేస్తారు. తర్వాత నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం గుత్తిలోని కే.టి.ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే ‘సీమ కరువుకు పరిష్కార మార్గాలు’ అనే అంశంపై రైతులు, వ్యవసాయ, నీటిపారుదల నిపుణులతో చర్చలు జరుపుతారు.
28న కదిరిలో పవన్ పర్యటిస్తారు. త‌ర్వాత హ‌నుమాన్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం పుట్టపర్తి చేరుకుని సత్యసాయి మందిరం, మంచినీటి పథకం, ఆస్పత్రిని సందర్శిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 29న ధర్మవరానికి వెళతారు. అక్కడ చేనేత కార్మికులతో మాట్లాడతారు. తర్వాత హిందూపురం వెళతారు. జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం చిక్బళ్లాపూర్‌కు వెళతారు. అక్కడ సి.వి.వి. ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరతారు.