ప‌రారీలో రౌడీషీట‌ర్

BREAKING NEWS
BREAKING NEWS

కడప: నగరంలోని చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విచారణ కోసం తీసుకొచ్చిన రౌడీషీటర్‌ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కడపకు చెందిన వినయ్‌కుమార్‌ రెడ్డి అనే రౌడీషీటర్‌పై పలు కిడ్నాప్, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల కింద పోలీసులు ఓ హత్య కేసులో వినయకుమార్‌రెడ్డిని అరెస్టు చేసి జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. బెయిల్‌పై రెండు రోజుల కిందట విడుదలయ్యాడు. పోలీసులు విచారణ కోసమని అతడిని నిన్న చిన్నచౌకు ఠాణాకు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ రోజు ఉదయం టిఫిన్‌ తిని చేతులు కడుక్కునేందుకు బయటికి వచ్చాడు. అప్పటికే రోడ్డుపై సిద్ధంగా ఉన్న వాహనంలో ఎక్కి అక్కడ నుంచి ఉడాయించాడు. దీంతో అతడిని పట్టుకొనేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.