‘ప‌ద్మావ‌తి’ విడుద‌ల‌ను నిర‌సిస్తూ డిసెంబ‌ర్ 1న భార‌త్ బంద్!

Padmavathi
Padmavathi movie

బెంగళూరు: పద్మావతి సినిమా విడుదలను నిరసిస్తూ రాజ్‌పుత్ కర్ణిసేన డిసెంబర్ 1న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది ఈ వివాదాస్పద మూవీని రిలీజ్ చేయనివ్వబోమని స్పష్టంచేస్తున్నది. సినిమా విడుద‌ల ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కర్ణిసేన నేత లోకేంద్ర సింగ్ కల్వి హెచ్చరించారు. ఇవాళ ఉదయం బెంగళూరులో రాజ్‌పుత్ కర్ణిసేనకు చెందిన సభ్యులు పద్మావతి మూవీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అటు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ కూడా సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని ప్రకటించారు. ఈయన ఫిల్మ్ స్టూడియో సెట్టింగ్, మజ్దూర్ యూనియన్ హెడ్ కూడా కావడం గమనార్హం. అయితే మూవీపై రోజురోజుకూ వివాదం ముదురుతుండటంతో దర్శకుడు భన్సాలీ వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. ఖిల్జీతో రాణి పద్మిణి ప్రేమ అన్నది ఒట్టి పుకారే అని, అలాంటిదేమీ సినిమాలో లేదని భన్సాలీ చెప్పినా వివాదం మాత్రం సద్దుమణగలేదు. ఇందులో నటించిన దీపికా, షాహిద్‌కపూర్, రణ్‌వీర్ సింగ్ కూడా సినిమాలో అందరూ ఊహిస్తున్నట్లుగా ఏమీ లేదని స్ప‌ష్టం చేశారు.