పత్తి అమ్మిన 72 గంటల్లో రైతుల ఖాతాలోకి చెల్లింపులు:హరీష్రావు

హైదరాబాద్: పత్తి అమ్మిన 72 గంటల్లో రైతుల ఖాతాలోకి నేరుగా చెల్లింపులు జరిగేలా చూడాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి పంటల దిగుబడి, ధరలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టవ్యాప్తంగా 200 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, శని, ఆదివారాల్లో అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి అన్నారు. పత్తి తేమశాతం 12లోపే ఉండేట్టుగా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, అధికారులు తరుచుగా పత్తి కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. జిన్నింగ్ మిల్లుల దగ్గర రైతులపై అదనపుచార్జీలు వేయకుండా చూడాలని, రైతు సమన్వయ సమితి కన్వీనర్లతో కలెక్టర్లు సమావేశం ఏర్పాటుచేయాలని
స్పష్టం చేశారు.