ప్లే స్టోర్ నుంచి సియం అధికారిక యాప్ గాయ‌బ్‌

siddha ramaiah
siddha ramaiah

బెంగుళూరుః గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ను కాంగ్రెస్ పార్టీ తొలగించింది. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అధికారిక యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాయమైంది.సిద్దూ యాప్ నుంచి ఓ విదేశీ కంపెనీకి సమాచారం వెళుతోందనే ఆరోపణలు వచ్చాయి. సిద్దూ యాప్ కోసం ప్లే స్టోర్ లో వెతికినా యాప్ లేదని చూపిస్తోంది. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వెబ్ సైట్లలో ముఖ్యమంత్రి ఫొటోలను తీసివేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.