ప్లేఆఫ్ కు చేరువ‌లో సన్‌రైజ‌ర్స్‌!

SUNRISERS HYD
SUNRISERS HYD

హైద‌రాబాద్ః సన్‌రైజర్స్‌ ఖాతాలో మరో అద్భుత విజయం చేరింది. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో మరోసారి పంజా విసిరిన‌ రైజర్స్‌.. వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 56), షకీబల్‌ (32 బంతుల్లో 5 ఫోర్లతో 35) మాత్రమే రాణించారు. సిరాజ్‌, సౌథీ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఓవర్లన్నీ ఆడిన ఆర్‌సీబీ ఆరు వికెట్లకు 141 పరుగులే చేసి ఓడిపోయింది. కోహ్లీ (30 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 39), గ్రాండ్‌హోమ్‌ (29 బంతుల్లో ఫోర్‌, 2 సిక్సర్లతో 33) పోరాడినా ఫలితం లేకపోయింది. షకీబల్‌ రెండు వికెట్లతో రాణించాడు.