ప్లేఆఫ్‌కు సన్‌ రైజర్స్‌

RASHID1
RASHID1

ప్లేఆఫ్‌కు సన్‌ రైజర్స్‌

హైదరాబాద్‌17 పాయింట్లతో ద్వితీయ స్థానం

కాన్పూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదవ సీజన్‌లో ఢిపెండింగ ఛాంపియన్స్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. లీగ్‌లో ఎనిమిదవ విజయం సాధించి 17 పాయింట్లతో బెంగళూరు మ్యాచ్‌ రద్దుతో ఒక పాయింట్‌ కలిపి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలి చింది.చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో గుజ రాత్‌ లయన్స్‌ను సన్‌రైజర్స్‌ 8 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది.4 వికెట్లు తీసిన హైదరా బాద్‌ కుర్రాడు సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

గుజరాత్‌ లయన్స్‌ నిర్ధే శించిన 155 పరుగుల టార్గెట్‌ను ఛేదించే విష యంలో సన్‌ రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. 25 పరు గులకే శిఖర్‌ధావన్‌ 18 పరుగులతో హెన్రిక్స్‌ 4 పరుగులతో వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సన్‌ రైజర్స్‌ సారధి డేవిడ్‌ వార్నర్‌ 69 పరగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. మొదట నిలకడగా ఆడిన డేవిడ్‌ ఆ తరువాత చెల రేగాడు.అంది వచ్చిన బంతుల్ని చక్కగా బౌండరీకి తరలించి హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.

వార్నర్‌్‌ సహకారంతో విజ§్‌ుశంకర్‌ 63 పరుగులతో సత్తా చాటాడు. ఐపిఎల్‌లో తొలిహాఫ్‌ సెంచరీ సాధిం చాడు. రెండవ వికెట్‌కు 133 పరుగులు అజేయ భాగస్వామ్యం నెలకొల్పి విజయంలో కీలకంగా నిలి చాడు.దీంతో 11 బంతులు ఉండగానే సన్‌ రైజర్స్‌ గెలిచింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ లయన్స్‌ను సన్‌రైజర్స్‌ బౌలర్లు 19.2 ఓవర్లకు 164 పరుగుల కు ఆలౌట్‌ చేశారు.ఇషాన్‌ కిషన్‌ 61 పరుగులు,డ్వేన్‌ 54 పరుగులతో దూసుకు పోయారు. 111 పరుగుల వరకు వికెట్‌ కోల్పోని గుజరాత్‌ను మహ్మద్‌ సిరాజ్‌ 4 వికెట్లు,రషీద్‌ఖాన్‌ 3వికెట్లు,భువనేశ్వర్‌ 2వికెట్లతో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.తొలి పదిఓవర్లలో వికెట్‌ కోల్పోని గుజరాత్‌ను తరువాత పదిఓవర్లలో ఆలౌట్‌ చేశారు.