ప్లీనరీ పేరుతో కోట్ల‌ రూపాయ‌ల ప్ర‌జా ధ‌నo వృథా

Ponnam Prabhakar
Ponnam Prabhakar

కేసీఆర్ స‌ర్కార్‌పై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత‌ పొన్నం ప్ర‌భాక‌ర్ ఇవాళ  ఫైర‌య్యారు. ప్లీనరీ పేరుతో కోట్ల‌రూపాయ‌ల ప్ర‌జా ధ‌నాన్ని వృథా చేస్తూ, టిఆర్ఎస్ పార్టీ అధినాయ‌క‌త్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఎంతవరకు అమలయ్యాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అలాగే… కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులకు హెడ్ రెగ్యులేటరీలు కట్టి మొత్తం టిఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటున్నారని తెలిపారు.