ప్లాస్టిక్‌ ప్రాణాంతకం

PLASTIC BOTTLES
PLASTIC BOTTLES

ప్లాస్టిక్‌ ప్రాణాంతకం

వార్త సైన్స్‌డెస్క్‌ : ఒకప్పుడు మార్కెట్‌కు వెళ్లి సరుకులు కొనాలంటే వెంట క్లాత్‌ సంచీనో.. గోనె సంచీనో తీసుకెళ్లేవారు. ఇప్పుడు ప్రతిదానికీ ప్లాస్టిక్‌ కవర్ల వాడకం ఎంత పెరిగి పోయిందంటే.. వాడేసిన ప్లాస్టిక్‌ కవర్లను సముద్రంలో కలిపితే అక్కడి చేపల పునరో త్పత్తి తగ్గిపోయిందట. ఒక్క జంతువ్ఞలకే కాదు ప్లాస్టిక్‌ మనుషలకూ అత్యంత ప్రమాదకరమని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు నొక్కి చెబుతు న్నారు.

బిస్పేనాల్‌ ఎ(బిపిఎ) అనే రసాయన పదార్థాన్ని ప్లాస్టిక్‌ వస్తువ్ఞల తయారీలో విరి విగా ఉపయోగిస్తారు. దీనినివల్ల మనిషి నాడీవ్యవస్థ, పునరోత్పత్తి, ఎండోక్రైన్‌, స్కిన్‌… ఇలా శరీరంలో చాలా జీవవ్యవస్థలను దెబ్బతీ స్తుందట. ముఖ్యంగా 80 శాతం యువకులు, చిన్నారులలో ఈ బిపిఎవల్ల ఎక్కువగా రోగాలు వస్తున్నాయట. వాటర్‌బాటిల్స్‌, టిఫిన్‌ బాక్సులు, పాల సీసాలు.. ఇలాంటి వాటిలో వేడి చల్లటి ఆహార పదార్థలను నిలువ వ్ఞంచితే.. ప్లాస్టిక్‌, ఆహారపదార్థాల మధ్య రసాయన క్రియలు జరిగి బిపిఎ రంగంలోకి దిగుతుందట. ఇక మెల్లగా రోగాలు దాడి చేస్తా యన్నమాట. స్త్రీలలో అయితే బిపిఎ మరీ ప్రమాదకరంగా దాడిచేస్తుందట. లివర్‌, కిడ్నీ, హార్మోన్లులు, మమ్మరీ గ్లాండ్లు, ఇమ్యూన్‌ వ్యవస్థలు బాగా దెబ్బ తింటాయట. ఫలితంగా పుట్టే బిడ్డలకు రోగనిరోధక శక్తి కాస్తా తగ్గిపోతుందట. ఇన్ని నష్టాలను చేసే ప్లాస్టిక్‌ను వాడకుండా వదిలించుకోవటమే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.