ప్ర‌సాదం తిని అస్వ‌స్థ‌త‌

Illness
Illness

భోపాల్‌: శివరాత్రి పర్వదినం రోజున మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా తయారు చేసిన ప్రసాదం తిని 1500 మంది అస్వస్థతకు గురయ్యారు. బడ్‌వానీ పట్టణంలోని ఓ ఆశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఆశ్రమంలో కిచిడీ, మిఠాయి తిన్న వెంటనే అస్వస్థతకు గురైన భక్తులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో బడ్‌వానీ పట్టణంలోని ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.