ప్ర‌శాంతంగా ముగిసిన హిమాచ‌ల్ పోలింగ్

poling himachal pradesh
poling himachal pradesh

ఢిల్లీః హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారీగా పోలింగ్ న‌మోదైంది. 68 నియోజకవర్గాలకు గురువారం జరిగిన పోలింగ్‌లో 70 శాతానికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 337 మంది అభ్యర్థుల భవితవ్యం వీవీపీఏటీ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఓటర్లు తాము వేసిన ఓట్లకు రశీదులను చూసుకునే అవకాశాన్ని వినియోగించుకున్నారు. సుమారు 100 ఈవీఎంలలో సాంకేతిక లోపం ఏర్పడటంతో కాసేపు ఇబ్బందులు తలెత్తాయి. 58 ఈవీఎంలను, 102 వీవీపీఏటీలను మార్చారు. అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు ముందు క్యూలలో నిల్చున్నవారు మాత్రమే ఓటు వేసేందుకు వేచి ఉన్నారు. కాగా 1,000 మంది టిబెటన్ శరణార్థులకు కూడా ఈ ఎన్నికలలో ఓటు హక్కు ఉంది. భారతదేశపు తొలి ఓటరు శ్యామ్ శరణ్ సరణ్ నేగీ తన ఓటు హక్కును కల్ప పోలింగ్ బూత్‌లో వినియోగించుకున్నారు.