ప్ర‌ముఖ గాయ‌కుడు గ‌జ‌ల్ శ్రీనివాస్ అరెస్టు

gajal srinivas
gajal srinivas

హైద‌రాబాద్ః ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించారంటూ కుమారి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా… ఆకాశవాణి వెబ్‌ రెడియోలో రేడియోజాకీగా కుమారి పనిచేస్తున్నారు. ప్రముఖ గాయకునిగా గజల్ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లోనేగాక విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన అరెస్టు వార్త సాహితీ లోకంలో కలకలం రేపింది.