ప్ర‌భుత్వ కార్యాల‌యం కాషాయ‌మ‌యం

police station
police station

ల‌క్నోః యోగి సర్కార్ పుణ్యమా అని యూపీలోని ప్రభుత్వ కార్యాలయాలు ఒకొటొక్కటిగా కాషాయమయం అవుతున్నాయి. దీనిపై విమర్శలు ఎదురవుతున్నా సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గత నెలలో హజ్ కమిటీ కార్యాలయం గోడలకు కాషాయిరంగు వేయడం వివాదానికి దారితీసింది. తాజాగా, లక్నోలో అత్యంత విలాసవంతమైన ఏరియాగా పేరున్న గోమతి నగర్ ప్రభుత్వ పోలీస్ స్టేషన్‌‌కు కాషాయిరంగు పెయింట్ వేశారు. పోలీస్ స్టేషన్‌ ఆవరణలో ఒక ఆలయం కూడా వెలియబోతోందని చెబుతున్నారు. గత నెలలో లక్నోలోని ఖైసర్ బాగ్ పోలీసు స్టేషన్‌కు కూడా కాషాయిరంగు పెయింట్ వేశారు.