ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో వైద్యుల కొర‌త‌

 

Doctor
Doctor

పాట్నా : దేశంలో వైద్యుల కొరత ఉందని మరోసారి తేటతెల్లమైంది. బీహార్‌లో 17,000 మంది పేషెంట్స్‌ను ఒక డాక్టర్‌ మాత్రమే చూశారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంగల్‌ పాండే అసెంబ్ల్లీలో శుక్రవారం వెల్లడించడం దీనికి ఉదాహరణ. బీహార్‌లో డాక్టర్‌, ప్రజల నిష్పత్తి1:17,685 ఉందని తెలిపారు. ఇది జాతీయ సగటు 1:11, 097కు కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. వైద్య కళాశాలతో సహా రాష్ట్రంలో 6,830 మంది వైద్యులు పనిచేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానం తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూటివో) ప్రమాణాల ప్రకారం వైద్యులు, పేషెంట్ల 1:1000 నిష్పత్తి, ప్రతి వెయ్యి మంది ప్రజలకు ఒక డాక్టర్‌ వుండాల్సి వుంది.. దేశంలో నమోదు చేసుకున్న వైద్యులు 10 లక్షల మంది ఉండగా, బీహార్‌లో 40, 043 మంది ఉన్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వైద్యులను నియమించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2016 బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 1,805 వైద్యులు, 665 మంది నిపుణులను నియమించిందని తెలిపారు.