ప్ర‌పంచ క‌ప్-2019 త‌ర్వ‌తే రిటైర్మెంట్ః యువీ

Yuvaraj singh
Yuvaraj singh

2019 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాన‌ని భార‌త్ ఆల్ రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ తెలిపాడు. గత కొద్దిరోజులుగా యువీ జాతీయ జట్టులో చోటుకోల్పోయిన విషయం తెలిసిందే. చివరిసారిగా యువీ 2017 జూన్‌లో భారత్ తరఫున వన్డే మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించాడు. వచ్చే ఐపీఎల్ టోర్నీ తనకు అత్యంత ముఖ్యమైనదని.. ఇందులో అద్భుతంగా రాణించి 2019 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి ఉపయోగపడుతుందని యువీ అభిప్రాయపడ్డాడు.