ప్ర‌పంచ‌క‌ప్ ఆడిన త‌ర్వాత నిర్ణ‌యం

Yuvaraj singh
Yuvaraj singh

యువీ త‌న రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్న‌ట్టు మీడియాతో చెప్పాడు. `ప్ర‌తీ ఆట‌గాడూ ఎదో ఒక రోజున త‌న ఆట‌కు దూరం కావాల్సిందే. అందుకు నేనేమీ మిన‌హాయింపు కాదు. నేను 18 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. నా రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. అయితే ఫార్మాట్ ఏదైనా 2019 ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు క్రికెట్ ఆడాల‌నుకుంటున్నా. వ‌చ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జ‌రిగే 2019 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడాల‌నుకుంటున్నా. ఆ అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నా. అప్ప‌టివ‌రకు వేచి చూసి రిటైర్మెంట్‌పై నా నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తా` అని యువీ చెప్పాడు.