ప్ర‌ధాని ప‌ద‌వి అలక‌రించిన వ్య‌క్తిని కాంగ్రెస్ గౌర‌విస్తుందిః రాహుల్

Rahul copy
Rahul

చోటా ఉదయ్‌పూర్ః గుజరాత్‌ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలను పురస్కరించుకుని నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తమ పార్టీ ప్రధాని మోదీని గౌరవిస్తుందని, ఆయనపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అయ్యర్‌పై కఠిన చర్యలు తీసుకుందని చెప్పారు. ‘ప్రధాని పదవిని అలంకరించిన వ్యక్తిని కాంగ్రెస్‌ గౌరవిస్తుంది. ఆయనపై ఎవరూ ముఖ్యంగా, మా పార్టీ నుంచి తప్పుగా మాట్లాడరు. అందుకే మణిశంకర్‌ అయ్యర్‌పై కఠిన చర్యలు తీసుకున్నాం’ అని చెప్పారు. మరోవైపు బీజేపీపై ఎదురుదాడిని మాత్రం రాహుల్‌ కొనసాగించారు. ఇప్పటి వరకు గుజరాత్‌కు ఏం చేయాలన్నదానిపై ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపొందించలేదని తప్పుబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రైతు రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తామని తెలిపారు.