ప్ర‌చారం చేస్తుండ‌గానే ఎమ్మెల్యే మృతి

BJP MLA, VINAY KUMAR
BJP MLA, VINAY KUMAR

బెంగ‌ళూరుః కర్ణాటకలోని జయనగర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే బీఎన్ వినయ్‌కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. జయనగర్ నుంచి వినయ్‌కుమార్ మళ్లీ పోటీ చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, పార్టీ కార్యకర్తలు.. వినయ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం జయదేవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనను ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.