ప్రో కబడ్డీ లీగ్‌లో పాక్‌కు మూసుకుపోయిన దారులు;

nlg 2
Pro kabaddi

ప్రో కబడ్డీ లీగ్‌లో పాక్‌కు మూసుకుపోయిన దారులు;

న్యూఢిల్లీ: పాక్‌కు చెందిన కబడ్డీ ఆటగాళ్లు, ప్రో కబడ్డీ లీగ్‌ పోటీలపై గంపెడాశలు పెట్టుకున్నారు. వివిధ టీమ్‌లు పాక్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయాలని కూడా ఆసక్తి చూపాయి. దీంతో పాక్‌ ఆటగాళ్లను కూడా వేలంలో చేర్చాలని లీగ్‌ నిర్వాహకులు భావించారు. కానీ వారిని అనుమతించరాదని కేంద్రం నిర్ణయించింది.వచ్చే నెలలో జరిగే ప్రో కబడ్డీ లీగ్‌ పోటీల్లో పాకిస్తాన్‌ ఆటగాళ్లను ఆడనిచ్చే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. పొరుగు దేశం ఉగ్రవాదానికి ఊతమిచ్చినన్ని రోజులు వారిపై ఆంక్షలు ఉంటాయని తెలిపింది. తమ దేశంలోని ఉగ్ర మూలా లను సమూలంగా నాశనం చేసేంత వరకు పాక్‌ ఆగటాళ్లను ఆడనీ యడం అసాధ్యమని క్రీడా శాఖా మంత్రి విజ§్‌ు గోయల్‌ స్పష్టం చేశారు. కాగా, జూన్‌ 25న పుణెలో ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పూణె సుల్తాన్స్‌తో తెలుగు టైటాన్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే.