ప్రోటెస్టంట్‌ మత ఆవిర్భావంతో సంబంధంగల వార్ట్‌బర్గ్‌ క్యాజిల్‌

Wartburg_Eisenach
Wartburg_Eisenach

ప్రోటెస్టంట్‌ మత ఆవిర్భావంతో సంబంధంగల వార్ట్‌బర్గ్‌ క్యాజిల్‌

జర్మనీలోని సాక్సనీ ప్రాంతంలో గల వార్ట్‌బర్గ్‌ క్యాజిల్‌కు రాజకీయ ప్రాధాన్యతతోబాటు ప్రోటెస్టంట్‌ మత స్థాపకుడైన మార్టిన్‌ లూథర్‌ జీవితంతో కూడా సన్నిహిత సంబంధం వ్ఞంది. 1483 నవంబరు 10వతేదీ ఐలిచెన్‌ అనే గ్రామంలో జన్మించిన మార్టిన్‌ లూథర్‌ విట్టెన్‌ బర్గ్‌ యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేస్తున్న కాలంలో రోమన్‌ కాథలిక్‌ మతంలో ఆనాడు ప్రబలిన అక్రమాలను విమర్శించడానికి పూనుకొన్నాడు. ఇది నచ్చని పోప్‌ అతన్ని మతం నుండి వెలివేశాడు. కాని పోప్‌ ఉత్తరువ్ఞలను బహిరంగంగా కాల్చిలూథర్‌ పోప్‌ అధికా రాన్ని ధిక్కరించాడు. 1521 సంవత్సరంలో అప్పటి పవిత్ర రోమన్‌ చక్రవర్తి ఐదవ ఛార్లెస్‌ మార్టిన్‌ లూథర్‌ను వోర్మ్‌స్‌ అనే నగరానికి రప్పించి, విచారించి పోప్‌ ఉత్తర్వుల ధిక్కారనేరానికి దేశ బహిష్కరణకు ఆదేశించాడు.

కాని సాక్స్‌న్‌ రాజైనఫెర్డినాండ్‌ రహస్యంగా తన సైనికులను పంపి లూథర్‌ ను రక్షించి, తన రాజ్యంలోని వార్ట్‌బర్గ్‌ కోటలో అన్ని సదుపాయాలు కలిగించి బస ఏర్పాటు చేశాడు. మార్టిన్‌ లూథర్‌ దాదాపు ఒక సంవ త్సరం వార్ట్‌బర్గ్‌దుర్గంలో ఎవరి కంటపడకుండా ఏకాంతవాసంలో గడిపాడు. వార్ట్‌బర్గ్‌లో రహస్య జీవితం గడిపిన ఆ సంవత్సరకాలంలో ప్రొట స్టాంట్‌ మత స్థాపనకు రంగం తయారు చేసుకోగలిగాడు లూథర్‌. సామాన్య ప్రజలకందుబాటులో వ్ఞండేవిధంగా బైబిల్‌ గ్రంథాన్ని ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ ప్రకారంగా జర్మన్‌ భాషలోనికి తర్జుమా చేశాడు. అప్ప టికి కేవలం లాటిన్‌లో మాత్రమే వ్ఞండేది బైబిల్‌. మతాచార్యుల గుణగణాలకు సంబంధించిన ‘ఆన్‌ మొనస్టిక్‌వేస్‌ అనేమరొక గ్రంధాన్ని కూడా లూధర్‌ వార్ట్‌బర్గ్‌లో వ్ఞన్న ప్పుడే రాశాడు. ఇది లూథరానిజం వ్యాప్తికి ఎంతో దోహదపడింది. ప్రోటెస్టంట్‌ మత విధివిధానాలను నిర్దుష్టపద్ధతిలో రూపకల్పన చేసు కోవడానికి తన భావి కార్యక్రమాల ప్రణాళికా రచనకు వార్ట్‌బర్గ్‌ ప్రవాస జీవితం దోహదం చేసింది.

దట్టమైన అడవ్ఞల మధ్యగల వార్ట్‌ బర్గ్‌ దుర్గం మిక్కిలి విశాలమైన కోట. దాదాపు మూడువందల స్వతంత్ర రాజ్యాలుండిన జర్మనీ లో అంతర్భాగమైన సాక్స్‌న్‌ రాజ్యంలోని వార్ట్‌బర్గ్‌కోట రక్షణ అవసరాల దృష్ట్యా మిక్కిలి దురే నిర్మించబడింది. లోతైన అగద్త పరివేష్టతమైన ఈ కోటకు సమీ పంలోని నగరం ఐసనాక్‌. ఫ్యూడల్‌ కాలంనాటి మధ్య ఐరోపాలో వెలసిన ఒక ప్రధాన చారిత్రక భవనం వార్ట్‌బర్గ్‌. ఉత్తర దిక్కునగల ద్వారం చేర డానికి ముందు అగడ్తపై ఒక డ్రాబ్రిడ్జివ్ఞంది. ఇది పైకి, కిందికి కదులుతుంది.అనేక శతాబ్దాలైనా ఈ బ్రిడ్జి చక్కగా పనిచేస్తుండ డం విశేషం. కోటలోపల అనేక భవనాలున్నాయి.బహుళ అంత స్తులుగలఈపురాతన భవనాలపై ఆకర్షణీయంగా కనిపించే టవ ర్లున్నాయి. కొన్ని భవనాలు సైనికులుండే బారక్‌లు, అచ్చటికి వచ్చే ప్రభువ్ఞల విడిది గృహాలు ప్రత్యేకంగా ఉన్నాయి.

మధ్యలో గల రాజప్రాసాదం ఎంతో గంభీరంగావ్ఞంది. కోటలోపల ఒక చిన్న స్మశాన వాటిక కూడవ్ఞంది.నెపోలియన్‌ పరిపాలనా కాలంలో (1804-1815) జర్మనీలో చాలా రాజ్యాల నోడించి ‘కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రైన్‌ను స్థాపిం చాడు. కాని అతని ఓటమి తర్వాత (1815)లో వియన్నా సమావేశం ఆ కాన్ఫెడరేషన్‌ను రద్దుపరచిన పిదప జర్మనీలో ఏకీకరణకై జాతీయ తత్వం పెల్లుబికింది. జర్మన్‌ జాతీయోద్యమ కార్యకలాపాలకు వార్ట్‌బర్గ్‌ కేంద్ర బిందువ్ఞగా కొంతకాలం కొనసాగింది.సాక్స్‌న్‌ రాజైన గ్రాండ్‌ డ్యూక్‌ ఆధ్వర్యంలో వార్ట్‌బర్గ్‌ క్యాజిల్‌ పూర్తిగా పునర్నిర్మితమైంది. విధిలమైన రాజప్రాసాదం ఎంతో అందంగా తీర్చిదిద్దబడింది. అచ్చట చారిత్రాత్మక కర్టెన్‌ వెల్‌ అనే దిగుడుబావి పునరుద్దరించబడింది. మిగిలిన అన్ని భవనాలు కూడా పూర్వపు పద్ధతిలోనే పునర్నిర్మించబడ్డాయి. మార్టిన్‌ లూథర్‌ ఇక్కడ 1521-22 ప్రాంతంలో ప్రవాస జీవితం గడిపిన కారణంగా ప్రస్తుతం వార్ట్‌బర్గ్‌ ప్రొటస్టాంట్లకు ప్రధాన పర్యాటక కేంద్రంగా ప్రాధాన్యత పొందింది.