ప్రొ.కోదండరామ్‌ అరెస్టు

Kodandaram
TS JAC Chairman Prof. KodandaRam

ప్రొ.కోదండరామ్‌ అరెస్టు

హైదరాబాద్‌: నిరుద్యోగ ర్యాలీ, సభపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.అనుమతి లేకున్నా ర్యాలీ , సభ నిర్వహిస్తామని జెఎసి ప్రకటించటంతో పోలీసుల అరెస్టులకు తెరతీశారు.. జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ను ఇవాళ తెల్లవారుజామున అరెస్టు చేసి కామాటిపుర పోలీసు స్టేషన్‌కు తరలించారు.. పలువురు జెఎసి నేతలను కూడ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.. ఇందిరాపార్కు, సుందరయ్య విజ్ఞాన భవన్‌ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.