ప్రొఫెసర్‌ ఐలయ్యను ప్రభుత్వం శిక్షించాలి: ఎమ్మెల్సీవీర్రాజు

Somou veerraju
Somou veerraju

అమ‌రావ‌తి: ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యను జాతి విద్రోహ శక్తి అని, ఆయన్ని కెసిఆర్‌ ప్రభుత్వం చట్టబద్ధంగా శిక్షించాలని బిజెపి
ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కంచ ఐలయ్య విషయంలో
కెసిఆర్‌ సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని, తనను ఐలయ్య దూషిస్తే కెసిఆర్‌ చూస్తూ ఊరుకునేవారా? ఏపిలో
నియోజకవర్గాల్లో బిజెపిని బలోపేతం చేస్తామని, మోదీ మాట-చంద్రన్న బాట ద్వారా పథకాలు ప్రజల్లోకి
వెళ్తున్నాయని, అక్టోబర్‌లో అమిత్‌ షా విజయవాడలో పర్యటించునున్నారని చెప్పారు. సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ వరకు సేవా దివస్‌ను నిర్వహిస్తామని తెలిపారు.