ప్రొటెం స్పీకర్‌ ఉంటే అసెంబ్లీకి రాను

Raja singh
Raja singh

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ తప్పుబట్టారు. ఎంఐఎం సభ్యుడు ప్రొటెం స్పీకర్‌గా ఉండగా తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనని తెగేసి చెప్పారు. ప్రొటెం స్పీకర్‌ ఉన్న సమయంలో అసెంబ్లీలోకి తాను అడుగుపెట్టనని రాజాసింగ్‌ ప్రతిన బూనారు. సియం కేసిఆర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి మంచిదని సూచించారు.