ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ద‌ళారుల ఆట క‌ట్టుః సివి.ఆనంద్‌

cv. anand
cv. anand

హైద‌రాబాద్ః హెచ్‌ఐసీసీలో రెండో రోజు జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు జరుగుతోంది. ఈ గవర్నెన్స్-బెస్ట్ ప్రాక్టీసెస్ అనే అంశంపై ప్యానెల్ డిస్కషన్ జరుగుతోంది. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, సివిల్ స‌ప్లై కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీవీ ఆనంద్ మాట్లాడుతూ… ఈ గవర్నెన్స్ ద్వారా వరిధాన్యం కొనుగోలులో వినూత్న మార్పులు తీసుకొచ్చినం. వరిధాన్యం కొనుగోలులో దళారులు చేరి రైతులకు మద్దతు ధర రాకుండా చేస్తున్నారు. ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టం ద్వారా దళారులను అరికట్టినం. రేషన్ బియ్యం పంపిణీలో ఈ-గవర్నెన్స్‌తో వందల కోట్లు ఆదా అయ్యింది. వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేసి బియ్య రవాణాను అరికట్టినం. 10 జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపంపిణి వ్యవస్థను పకడ్బందిగా కొనసాగిస్తున్నాం.